
రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటనించారు. హెలిక్యాప్టర్ తుఫాన్ ప్రావింత ప్రాంతాలను పరిశలించినా ఆయన పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు దేశాలు జారీ చేశారు.అనంతరం స్వయంగా పంటపొలాల్లోకి వెళ్లి పరిశీలించారు.

ఏరియల్ సర్వే తర్వాత రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమూర్లంక చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేలకొరిగిన వరి పొలాల పరిశీలించారు.

కొనసీమ జిల్లాల్లోని అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు.

కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో తన పర్యటనలో ప్రోటోకాల్‌ను పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు.. పునరావాస శిబిరంలో ఉన్న బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వర్షాల కారంణంగా ధ్వంసమైన విద్యుత్‌ను యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించాంమని తెలిపారు. ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని.. కొన్ని జిల్లాల్లో వరి, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయన్నారు. ముందస్తు చర్యల కారణంగానే తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు.