Andhra Pradesh: ‘వాల్మీకి మహర్షి రామాయణం రాసింది ఈ గుహల్లోనే..’ నేటి నుంచి పర్యాటకుల సందర్శనకు అనుమతి

Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2024 | 11:47 AM

నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. రంగు రంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. బేతంచెర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిశాయి. వందలో వేల ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు నిన్నటి వరకు రాలేదు..

1 / 5
నంద్యాల, జనవరి 28: నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. రంగు రంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేయనున్నాయి.

2 / 5
బేతంచెర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిశాయి. వందల.. వేల.. ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు  నిన్నటి వరకు రాలేదు.

3 / 5
అలాగే ప్యాపిలి మండలంలోనీ బోయవాళ్ళపల్లి దగ్గర ఉన్న వాల్మీకి గుహలు కూడా పర్యాటకుల సందర్శనార్ధం అందుబాటులోకి తీసుకొచ్చారు. పైన భూమి దాని కింద సహజసిద్ధంగా గుహలు కనువిందు చేస్తున్నాయి. ఈ రెండింటిని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

4 / 5
మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు పదికోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారు. గుహలకు ఉన్న సహజత్వం పోకుండానే వాటిని తీర్చిదిద్ది రహదారులు విద్యుత్తు అలంకరణలు చేయించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.

5 / 5
వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఈ గుహలోనే రాశారని, గుహలలో ఉన్న శివలింగాలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నాయని చెప్తుంటారు. అలాంటి గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక నేటి నుంచి ఈ రెండు గుహలలో సందడే సందడి.