West Godavari: అమ్మకు వందేళ్ల వందనం.. 101ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాల కుటుంబసభ్యుల జన్మదిన వేడుకలు

| Edited By: Surya Kala

Oct 03, 2023 | 12:23 PM

ప్రస్తుత సమాజంలో కన్న బిడ్డలకు తల్లితండ్రులే బరువైపోయారు. బిడ్డ పుట్టినప్పుడు ఉన్న సంతోషం తల్లిదండ్రులకు ఎందులోనూ ఉండదు. తమ బిడ్డలను ప్రేమగా పెంచి, పెద్ద చేసి, వారికి విద్య బుద్ధులు నేర్పి వారు ఉన్నత స్థానంలో నిలబడడానికి తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తారు. కానీ కొందరు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత తమ ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులనే వదిలించుకోవాలని క్రమంలో వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు.

1 / 6
ఇక్కడ అలాంటి వాటికి అన్నిటికీ భిన్నంగా తమ కుటుంబంలో ఆరు తరాలు వారు  కలిసి ఓ వృద్ధురాలు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ వేడుక చూసేందుకు ఆ కుటుంబ సభ్యులతో పాటు తమ బంధువులను పిలిచి తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని నలుగురికి చాటి చెప్పే విధంగా పలువురి ప్రశంసలు పొందారు.

2 / 6
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన కంచర్ల వెంకట రత్నమ్మ అనే వృద్ధురాలు 101 సంవత్సరాలు పూర్తి చేసుకుని 102 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు తమ తర తరాలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు.

3 / 6
జన్మదిన వేడుకలలో వృద్ధురాలి కూతుర్లు, అల్లుళ్లు, వారికి జన్మించిన సంతానమైన మనువళ్లు, మనువరాళ్లు, అదేవిధంగా వారికి పుట్టిన సంతానమైన ముని మనవాళ్లు ముని మనుమరాళ్లు ఇలా మొత్తం కలిపి ఆరు తరాలకు చెందిన 72 మంది ఈ వేడుకలో పాల్గొన్న. ఆ వంశ వృక్షమంతా ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు.

4 / 6
ఈ కార్యక్రమానికి తమ బంధువులను సైతం పిలిచి జన్మదిన వేడుకలలో వారిని కూడా భాగస్వాములు చేశారు. దాంతోపాటు ప్రస్తుత సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. నేటి సమాజంలో తమ బిడ్డలు తల్లిదండ్రులపై తీవ్ర వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రులు తమ బిడ్డలకు కనిపించే ప్రత్యక్ష దైవాలని,

5 / 6
ఎన్నో ఆశలతో వృద్ధాప్యంలో అడుగిడిన తల్లిదండ్రులను తమ బిడ్డలు వారిపై  ప్రేమ, వాత్సల్యాలు చూపకుండా వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తూ ఏదో గెస్ట్లుగా అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళుతున్నారని, అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల పట్ల అంకిత భావంతో వారిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాలని

6 / 6
 ఈ కార్యక్రమం  ద్వారా  ఎవరైనా ఒక్కరు మారిన చాలా సంతోషమని, దానినీ దృష్టిలో ఉంచుకునే ఆదర్శంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని తమ కుటుంబ సభ్యుల మధ్య వేడుకల నిర్వహించినట్లు తెలిపారు.