
దానిమ్మ ఆకులను అనేక సాధారణ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆకులతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. కామెర్లు, విరేచనాలు, కడుపు నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులతో చేసిన కషాయం శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి తీసుకోవటం వల్ల ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది దగ్గు, జలుబుకి మంచి రెమిడీగా పనిచేస్తుంది. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తాగటం వల్ల ఇది దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ గొంతులోని ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, దానిమ్మపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. విటమిన్ సి కూడా ఉంటుంది.

దానిమ్మ ఆకులలో ఉండే ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు నోటి పూతల చికిత్సకు దానిమ్మ ఆకుల రసాన్ని కూడా ఉపయోగించవచ్చు.

అంతేకాదు దానిమ్మ ఆకులు నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆకులను ఉదయం పరగడుపున మరిగించి తీసుకోవాలి.. లేకపోతే ఈ నీటిని పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చక్కని పరిష్కారం.

అంతేకాదు దానిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల ప్రాణాంతక జబ్బుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ ఆకులు ఎగ్జిమా సమస్య నుంచి కాపాడుతుంది. ఇది చర్మం దురద సమస్యను నివారిస్తుంది. దానిమ్మ ఆకులను దంచి పేస్టు మాదిరి చేసుకొని దురద ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాదు..ముఖంపై మచ్చలు వాటి తాలూకు ఆనవాళ్లు ఉంటే దానిమ్మ ఆకులను దంచి పేస్టును ముఖానికి అప్లై చేయాలి.