Moringa Tea: మునగాకు టీ తాగితే కలిగే 5 అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!

|

Dec 20, 2023 | 4:57 PM

సాధారణంగా మునగకాయలను పప్పు సాంబారు, కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వివిధ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మునగాకులను కూడా ఆహారంగా, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మునగాకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.ఇటీవల కాలంలో మునగాకు టీ కూడా ప్రజాదరణ పొందుతోంది. మునగ చెట్టు ఆకులను ఉపయోగించి తయారు చేసే టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 6
మొరింగాలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మొరింగ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మునగాకు టీ తాగితే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపడుతుంది.

2 / 6
కాలేయం ఆరోగ్యం: ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే మునగ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మునగాకు టీ తాగేవారిలో రక్తపోటు స్థాయిలు నియంత్రణలోకి వచ్చినట్లు అధ్యయనాలు తెలిపాయి.

3 / 6
కంటి ఆరోగ్యం: మొరింగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని ఉపయోగం కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4 / 6
బీపీ నియంత్రణ: రోజూ ఒక కప్పు మొరింగ టీ తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపడుతుంది.

5 / 6
బరువు తగ్గడం: క్లోరోజెనిక్ యాసిడ్ మోరింగ ఆకులలో కనిపిస్తుంది. మొరింగ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

6 / 6
విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు మునగాకు టీ తాగడం ద్వారా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పొందడానికి, కంటిచూపు మెరగుపడటానికి కూడా సహయపడతాయని అంటున్నారు.