- Telugu News Photo Gallery Amazing Health Benefits of drinking turmeric water daily, check here is details in Telugu
Turmeric Water: రోజూ ఒక్క గ్లాస్ పసుపు నీళ్లు తాగండి.. ఈ సమస్యలకు బైబై చెప్పేయండి!
ప్రతీ ఇంట్లోని వంటగదిలో ఉండే నిత్యవసర వస్తువుల్లో పసుపు కూడా ఒకటి. కాలాలు మారినా.. లైఫ్‌స్టైల్‌లో ఎన్ని మార్పులు వచ్చినా వంటల్లో పసుపును ఉపయోగించడంలో మాత్రం ఎలాంటి చేంజస్ లేవు. ఎంతో కాలంగా పసుపును వంటల్లో విరివిగా యూజ్ చేస్తున్నారు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా పసుపును పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో..
Updated on: Mar 11, 2024 | 4:15 PM

ప్రతీ ఇంట్లోని వంటగదిలో ఉండే నిత్యవసర వస్తువుల్లో పసుపు కూడా ఒకటి. కాలాలు మారినా.. లైఫ్‌స్టైల్‌లో ఎన్ని మార్పులు వచ్చినా వంటల్లో పసుపును ఉపయోగించడంలో మాత్రం ఎలాంటి చేంజస్ లేవు. ఎంతో కాలంగా పసుపును వంటల్లో విరివిగా యూజ్ చేస్తున్నారు.

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా పసుపును పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపును కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ పసుపు వాటర్ తాగడం వల్ల ఫ్రీరాడికల్స్ నశిస్తాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అర్థ రైటీస్, కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. పసుపు నీటిని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా లభిస్తుంది. పెయిన్ కిల్లర్‌గా పని చేస్తుంది.

పసుపులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. తరచూ తాగుతూ ఉంటే.. వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుంటా ఉంటారు. పసుపు నీటిని తాగితే జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

పసుపు నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుంది. డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది. చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది.




