
దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న దాల్చిన చెక్క శరీరంలో మంటను తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన నీళ్లను తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాల్చిన నీళ్లు మెటాబలిజం రేటును కూడా పెంచుతాయి. బరువు తగ్గడానికి, కొవ్వు కరగడానికి దాల్చిని నీళ్లు బాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా దాల్చిన చెక్క నీటిని తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.

దాల్చిన చెక్కనీటిని తీసుకోవటం వల్ల ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. శరీరం కేలరీల తీసుకోవడం సులభతరం చేస్తుంది. దాల్చిన చెక్క నీరు వివిధ భాగాల కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క నీళ్లలో యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాల్చిన నీళ్లను తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Cinnamon Water