Elaichi Benefits For Health: యాలుకలు ప్రతి వంటింట్లో ఉంటాయి. ఆహారంలో సువాసన, రుచిని పెంచడానికి యాలకులను ఉపయోగిస్తారు. టీ లాంటి పానీయాలల్లో కూడా వినియోగిస్తారు. అయితే, యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలున్నాయి. అందుకే యాలకులు తినాలని సూచిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు. యాలుకల రుచిని ఇష్టపడని వారంటూ ఉండరు.. దాని ప్రత్యేక రుచి ఆహార రుచిని పెంచుతుంది. దీనిని సాధారణంగా స్వీట్స్, పులావ్, బిర్యానీ, హల్వాలో ఉపయోగిస్తారు. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. యాలకులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ: యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఏలకుల వల్ల ఎంజైమ్‌ల స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.
తాజా శ్వాస: యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ తాజా శ్వాసను అందిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు కూడా దూరమవుతాయి.
రక్తప్రసరణ మెరుగవుతుంది: యాలకులు సహజసిద్ధమైన రక్తాన్ని పల్చగా చేసేలా పనిచేస్తుంది. దీనివల్ల సిరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
శరీరం డిటాక్సిఫై అవుతుంది (డిటాక్సిఫికేషన్): విషపూరిత పదార్థాలు మన శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమయితే.. అది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ యాలకులు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన పెరిగి శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వలన కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదం తొలగిపోతుంది.
లైంగిక సమస్యలు దూరం: పురుషులు కనీసం 2 యాలకులు తింటే పురుషుల్లో నపుంసకత్వం దూరమవుతుంది. యాలకులు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని వీడిగా లేదా.. పాలతో కలిపి తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.