Aloe Vera Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కలబందను అస్సలు తినొద్దు..

Updated on: Jul 14, 2023 | 9:55 PM

ఆయుర్వేదం పరంగా, ఔషధాల పరంగా కలబందకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఔషధాల గని. ఇది చర్మం, జుట్టు సమస్యలకే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇది శరీరంలో అధిక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అందుకే కలబందను తినాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. అయితే, కొందరు మాత్రం ఈ కలబందను అస్సలు తినొద్దు. తింటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఎవరు తినొద్దో ఇవాళ మనం తెలుసుకుందాం..

1 / 5
చర్మ, జుట్టు సమస్యల పరిష్కారినికి కలబంద చాలా మంచిది. ఇది శరీరంలో అధిక ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబందను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే కలబందను రోజూ తీసుకోవడం కూడా ప్రమాదకరమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
కలబందను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కలబందను తినకూడదని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

3 / 5
గ్యాస్, మలబద్ధకం: ఈ రెండు సమస్యలు ఉన్నవారు కలబందను తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా కలబంద తినొద్దు. తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
గుండె జబ్బులు: కలబందను అధికంగా తీసుకోవడం వలన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన సమస్యలను కలిగిస్తుంది.

5 / 5
నరాల సమస్య: ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, నరాల సమస్యలు కలబందను తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కలబంద తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారు కలబందను తినకూడదు.