
ఇదే జరిగితే బాలీవుడ్‌లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా, మేం అంటూ దిగాక అన్నీ సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప2 ఇప్పుడు నేషనల్ లెవల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

విషయమేంటి? అంటారా.? డెడ్‌లైన్‌ని మీట్ కావాలంటే ప్రొడక్షన్‌లో జోరు చూపించాలి. ఆ జోరు కూడా జోడు గుర్రాలు పరిగెత్తినంత స్పీడ్‌గా ఉండాలి. ఇప్పుడు పుష్ప2 అలాంటి జోరునే చూపిస్తోంది.

రెండు యూనిట్లతో షూటింగ్ స్పీడు పెంచారు కెప్టెన్ సుకుమార్. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది. కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.

ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు ప్యారలల్‌గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేయాలన్నది మేకర్స్ ప్లాన్. డిసెంబర్ 6 ఎప్పుడెప్పుడు వస్తుందా? పుష్ప సీక్వెల్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు.

పుష్ప3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్‌ని పుష్ప సీక్వెల్ ఎండింగ్‌లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్‌లో వైరల్ న్యూస్. ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది.