
నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫుడ్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి తెలిసినా కూడా చాలా మంది వాడుతూనే ఉంటారు. అయితే, మీరు ఈ నూనెను వంటలకు కాకుండా వేరే వాటికీ వాడితే కొన్ని సమస్యలను తరిమికొట్టొచ్చు.

పూరీలు వేసేటప్పుడు నూనెను బాగా డీప్ ఫ్రై చేస్తాము. అయితే, ఈ నూనెను వెంటనే పారబోయకండి. దీనిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని వాటిలో లవంగాలను వేసి వేసి దీపం వెలిగించండి. దీని వలన దోమలు రాకుండా ఉంటాయి.

మనం నిత్యం వాడే కొన్ని ఐరన్ వస్తువులు తుప్పు పడతాయి. అలాంటి వాటిని ఈ నూనెతో శుభ్ర పరచండి. మళ్ళీ అవి మంచిగా అయ్యి మెరుస్తాయి.

మొక్కలలో ఎన్నో కీటకాలు ఉంటాయి. వీటిని ఈ నూనెతో వదిలించుకోవచ్చు. డీప్ ఫ్రై చేసిన నూనెను ఒక డబ్బాలో పోసి మీ పెరట్లో పెట్టండి. ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ స్ప్రే చేస్తే అవి రాకుండా ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే ఈ నూనెతో తుప్పు పట్టిన కిటికీలను కూడా క్లీన్ చేయవచ్చు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ సారి నూనెను అస్సలు వేస్ట్ చేయకండి.