జొన్న కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు

Edited By:

Updated on: May 15, 2026 | 4:28 PM

ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు వినూత్న నిరసన తెలిపారు‌. పంట సాగు చేసి మేమే తప్పు చేశామని.. అన్యాయాలు, అక్రమాలు నేర్చుకోలేకపోయామని. మీ కడుపులు నింపేందుకు మేము కష్టపడి పంట పండించి చాలా పెద్ద తప్పు చేశామని.. ప్రజలే మమ్మల్ని క్షమించాలని కోరారు‌.

1 / 5

2 / 5
ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉంటే వెంటనే పంటను కొనుగోలు చెయ్యాలని జొన్న సంచుల పై మోకాళ్ల మీద కూర్చొని గుంజిలు తీసి నిరసన తెలిపారు ఇచ్చోడ మండలం ముఖరా కే రైతులు. జొన్న పంట వెంటనే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని వినూత్న నిరసన తెలిపారు.

3 / 5

 ముఖరా కే రైతులు,కాంగ్రెస్ ప్రభుత్వం లో పంటలు వేసి ,కాంగ్రెస్ కి ఓటు వేసి తప్పు చేసామని జొన్న సంచుల పై మోకాళ్ళ  మీద కూర్చొని గుంజిలు తీసి నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాని నమ్మి మోసపోయామని, ప్రభుత్వం కొనుగోలు చేస్తదని నమ్మి మోసపోయామని, పంటలు తీసి నెల రోజులు అయినా ఇంకా జొన్న పంట కొనుగోలు చేస్తలేరని,ప్రభుత్వం ఏమో నామ్ కే వాస్తే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మార్కెట్లో మాత్రం జొన్న పంట కొనుగోలు చేస్తలేరని అన్నారు.

4 / 5
 నాడు కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా కాలంలో సైతం పంటను కొనుగోలు చేసాడని, కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి పంటను కొనుగోలు చేసాడని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో మాత్రం పంట కొనుగోలు చేసే నాథుడు లేడని, కొనుగోలు కేంద్రాల్లో  అడిగితే  కొంటున్నామనే చెబుతున్నారు.

5 / 5

జొన్న కొనుగోలుకు ఇంకాప్రభుత్వం ఆదేశాలు రాలేవని అంటున్నారని, ఇంకో వారం రోజులు ఐతే వర్షాలు పడుడు ప్రారంభం అవుతుందని అంటున్నారు. వర్షాలు పడితే పంట మొత్తం నానిపోతుంది అని, వెంటనే జొన్న పంట కొనుగోలు చేయాలని ముఖరా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు.

Follow Us