సీరియల్లో అమ్మగా.. నెట్టింట గ్లామర్ బ్యూటీగా.. గత్తరలేపుతుందిగా..
Rajitha Chanti
Pic credit - Instagram
15 May 2026
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ గురించి చెప్పక్కర్లేదు. అందులో రిషి తల్లిగా జగతి మేడమ్ గా గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిరాయ్.
ఒకసారి ‘అమ్మ’ లేదా ‘అత్త’ పాత్రలలో ముద్ర పడితే హీరోయిన్‌గా మారడం కష్టమే. కానీ జ్యోతి రాయ్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
2010లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన జ్యోతి రాయ్, మొదట తన వయసు కంటే పెద్దవైన పాత్రలను ఎంచుకుని అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.
కన్నడలో కస్తూరీ నివాస, తమిళంలో కాత్రుక్కేన్న వెలి వంటి సీరియల్స్‌లో నటించినప్పటికీ, తెలుగులో జగతి పాత్ర ఆమెకు ఇంటింటికీ గుర్తింపునిచ్చింది.
ఆమె మెచ్యూర్డ్ యాక్టింగ్ , స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం జ్యోతి రాయ్ వెండితెరపై హీరోయిన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
ముఖ్యంగా ఆమె నటిస్తున్న ‘కిల్లర్’ (KilleR) మరియు ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఆమె భర్తే దర్శకుడు
జ్యోతి తన పాత ఇమేజ్‌ను చెరిపివేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫోటోషూట్స్ , రీల్స్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
చీరకట్టులో హుందాగా కనిపించిన జగతి మేడమ్, ఇప్పుడు మోడరన్ డ్రెస్సులలో స్టైలిష్ హీరోయిన్‌గా కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్