
టాలీవుడ్ నటి ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి (2021) తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ బెంగళూరు భామ. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్.

ఈ ఏడాది జూన్‌లో ఓ పాపకు జన్మనిచ్చారు కూడా. తమ కూతురికి అర్నా అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఐతే ఈ ఫొటోల్లో ఎప్పుడూ కూతురి ముఖాన్ని చూపించలేదు.

తాజాగా తన క్యూట్ బేబీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో కూడా కూతురి ముఖంపై ఎమోజీలను ఉంచింది.