
Acidity

కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఎసిడిటీ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. ముందుగా ఉదయం నిద్ర లేవగానే.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇది జీర్ణ వ్యవస్థను సక్రమం చేసి, గుండెల్లో మంట లేకుండా ఉంచుతుంది.

గుండెల్లో మంట అనిపించినప్పుడు కాసిన్ని పాలు తాగుతూ ఉండాలి. అయితే అందులో చక్కెర లేదా మరేదైనా తీపి పదార్ధాలు జోడించ కూడదు. ఇలా చేస్తే ఎసిడిటీ మరింత పెరుగుతుంది. అలాగే పండిన అరటిపండు తిన్నా ఉపశమనం పొందొచ్చు. పొటాషియం కడుపులో ఆమ్లానికి చాలా మంచి విరుగుడు.

కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలలోని కెఫిన్ జీర్ణ సమస్యలను మరింత కఠినతరం చేస్తాయి. అందువాల్ల వీటికి దూరంగా ఉండటం బెటర్.

వేడి నీళ్లలో టేబుల్ స్పూన్ సోపు వేసి, ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని వడకట్టి, అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.