చాణక్య నీతి : తెలివైన మహిళలు ఎవరో కాదు.. వీరేనంట!

Updated on: Jun 12, 2025 | 2:08 PM

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేసిన విషయం తెసిందే. ముఖ్యంగా విద్యా, డబ్బు, బంధాలు , బంధుత్వాలు, వ్యక్తిత్వం, స్త్రీ, పురుషులు, సక్సెస్, ఓటమి, స్నేహం, నమ్మకద్రోహం ఇలా అనేక విషయాల గురించి ఆయన తెలపడం జరిగింది. ఆయన బోధనలు ఈతరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఆచార్య చాణక్యుడు స్త్రీ గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది.

1 / 5
ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివి గల అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటారు. కానీ కోరుకున్న అందరి కోరిక నెరవేరదు. ఇక కొంత మంది మాత్రం మా అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి లేదా మా భార్య చాలా తెలివైనది అని గొప్పలు చెప్పుకుంటారు. అయితే ఆచార్య చాణక్యుడి ప్రకారం తెలివైన అమ్మాయి అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నా ఆమెనేనంట. కాగా అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివి ఉన్నట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
చాణక్యుడి ప్రకారం ఏ స్త్రీ అయితే చాలా సహనంగా ఓర్పుగా ఉంటుందో ఆమె చాలా తెలివైనది అని అర్థం అంట. ఆమె ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే చాలా ఓర్పుగా, సహనంతో వ్యవహరించి ఆ సమస్యల నుంచి సున్నితంగా బయటపడగలదంట. అంతే కాకుండా ఇతరుల మనసులు ఎప్పుడూ నొప్పించదు, అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోదంట. అలాంటి అమ్మాయి భార్యగా దొరకడం చాలా అదృష్టం అంటున్నాడు చాణక్యుడు.

3 / 5
కొంత మంది మాట్లాడితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అంతే కాకుండా వారిపై తెలియకుండానే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలానే చాలా సౌమ్యంగా, తియ్యగా మాట్లాడే స్త్రీ చాలా తెలివైనదంట. ఆమె తన తియ్యటి మాటలతో ఎంత కోపం ఉన్నసరే చాలా నిమ్మలంగా, నిదానంగా మాట్లాడుతుందంట. అందుకే తియ్యగా మాట్లాడే స్త్రీ చాలా తెలివైనది అంటున్నాడు చాణక్యుడు.

4 / 5
 ఏ స్త్రీ అయితే త్వర త్వరగా కాకుండా ఆలోచించి, ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటుందో ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలే కాకుండా చాలా తెలివైనదని అర్థం. ఎందుకంటే అలాంటి అమ్మాయి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా కుటుంబం కష్టాల్లో కూరకపోకుండా కాపాడుతుందంట. అందరినీ అర్థం చేసుకొని మెదులుతుందంట.

5 / 5
అదే విధంగా మనీ విషయంలో ఏ అమ్మాయి అయితే చాలా జాగ్రత్తగా ఉంటుందో ఆమె చాలా తెలివైనది అని అర్థం. అలాంటి మహిళ భవిష్యత్తులో కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే కాకుండా, తెలివిగా తన కుటుంబాన్ని కష్టాల నుంచి తప్పిస్తుందంట. అంతే కాకుండా డబ్బును ఎలా ఉపయోగించాలో తెలియడం వలన ఆర్థిక సమస్యలు ఆమె ఎదుర్కోదంట.