AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్‌.. డాక్టర్స్‌ ఏం చెబుతున్నారు!

Updated on: May 23, 2026 | 12:01 PM

సమ్మర్‌లో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూలర్ , ఏసీలను వాడుతారు. అయితే మన ఆరోగ్యానికి రెండింటిలో ఏది మంచిదో మీరెప్పుడైనా ఆలోంచారా? అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయంపై ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్‌తో పాటు పలువురు ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం.. వయస్సు, నివసించే ప్రాంతం, వాతావరణంలో తేమ, మన ఆరోగ్య స్థితిని బట్టి ఏది వాడాలో నిర్ణయించుకోవాలని వారు సూచిస్తున్నారు.

1 / 6
ఎయిర్ కూలర్ ప్రయోజనాలు: సాదారణంగా ఎయిర్ కూలర్లు నీటి ఆవిరి సిద్ధాంతంపై పనిచేస్తాయి. ఇవి గది చల్లగా ఉంచేందుకు గాలిలోని సహజమైన తేమను మెయింటేన్ చేస్తాయి. ఇది ఏసీల లాగా గదిని మరీ పొడిగా మార్చవు. అలాగే దీనివల్ల చర్మం, గొంతు, కళ్ళు ఎండిపోయే సమస్యలు కూడా రావు. ఏసీ గాలి పడని వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

2 / 6
కూలర్ వల్ల నష్టాలు: అయితే వీటిని వాడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్ ట్యాంకుల్లో నీటిని క్రమం తప్పకుండా మార్చకపోతే.. అందులో బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. కూలర్ల వల్ల గదిలో తేమ ఎక్కువవుతుంది. దీనివల్ల ఆస్తమా, సైనసైటిస్, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు. వాతావరణంలో ఉక్కపోత ఎక్కువగా ఉన్న రోజుల్లో కూలర్లు అస్సలు పనిచేయవు.

3 / 6
మండె ఎండల్లో ఏసీ వాడకం: తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఎయిర్ కండిషనర్లు కేవలం చల్లదనాన్నే కాకుండా, గదిలోని అదనపు తేమను కూడా బయటకు లాగేస్తాయి. దీని వల్ల మన డీహైడ్రెట్ కాకుండా చూస్తాయి. వృద్ధులు, గుండె జబ్బుల బాధితులు, డయాబెటిస్, బీపీ ఉన్నవారు, గర్భిణులు, చిన్న పిల్లలకు తీవ్రమైన వేడి నుండి రక్షణ కల్పించడంలో ఏసీలు సురక్షితమైనవని డాక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇవి గది ఉష్ణోగ్రతను ఒకేలా ఉంచడం వల్ల వేసవిలో ప్రశాంతమైన నిద్ర అందిస్తాయి.

4 / 6
ఏసీ వల్ల వచ్చే ఇబ్బందులు: ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా క్లీన్ చేయకపోతే, లోపల దుమ్ము పేరుకుపోయి శ్వాసకోశ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. బయట విపరీతమైన ఎండ నుండి రాగానే నేరుగా చల్లటి ఏసీ గదిలోకి వెళ్లడం వల్ల శరీరం ఒక్కసారిగా థర్మల్ షాక్‌కు గురవుతుంది.

5 / 6
సురక్షితంగా ఎలా వాడాలి? : వేసవిలో ఏసీ టెంపరేచర్‌ను ఎల్లప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం ఉత్తమం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏసీ రూమ్ అయినప్పటికీ కాసేపు కిటికీలు తెరిచి గాలి ప్రసరణ జరిగేలా చూడాలి.  దాహం వేసినా, వేయకపోయినా గంటకొకసారి నీళ్లు లేదా ఓఆర్ఎస్, మజ్జిగ లాంటి ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఏసీ ఫిల్టర్లను, కూలర్ వాటర్ ట్యాంకులను వారం లేదా పది రోజులకు ఒకసారి కచ్చితంగా క్లీన్ చేయాలి.

6 / 6
ఫైనల్‌గా దేన్ని ఎంచుకోవాలి? : మీరు నివసించే ప్రాంతంలో విపరీతమైన వేడి, ఉక్కపోత ఉండి.. ఇంట్లో వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటే ఏసీని ఎంచుకోవడం మంచిది. ఇది హీట్-స్ట్రోక్ నుండి కాపాడుతుంది. ఒకవేళ మీరు పొడి వాతావరణం ఉన్న ప్రాంతంలో ఉంటూ, చర్మం, గొంతు ఎండిపోయే సమస్యలు రాకూడదనుకుంటే, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఎయిర్ కూలర్ ఉత్తమ ఎంపిక. ఏది వాడినా నిరంతరం శుభ్రత పాటించడం, బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మాత్రమే మిమ్మల్ని ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉంచుతాయి.

Follow Us