
వెచ్చదనం: శీతాకాలంలో ఎలుకలు ఎక్కువగా ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం వెచ్చదనం. చలికాలంలో బయట ఉష్ణోగ్రతలు పడిపోతాయి, దీంతో ఎలుకలు వెచ్చదనం కోసం వెతుకుతాయి. అలాంటప్పుడు అవి మీ ఇంట్లోకి దూరుతాయి. ఇంట్లోని అటక లేదా గోడలలోని ఖాళీ ప్రదేశాలను ఆశ్రయంగా చేసుకొని జీవనం సాగిస్తాయి.

ఆహారం: రెండో విషయం ఏంటంటే.. ఆహరం.. మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టడం, లేదా తిని ఇంట్లో పడేయడం చేస్తే.. అవి ఎలుకలను ఆకర్షిస్తాయి. వాటిని ఎలుకలు చూస్తే.. అవి ఇంట్లోకి ప్రవేశించి.. వాటిని తినేందుకు ప్రయత్నిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మీరు ఆహారాన్ని మూతపెట్టిన పాత్రలో ఉంచండి.

నీరు: అన్ని జంతువుల మాదిరిగానే, ఎలుకలకు నీరు అవసరం. లోపల, లీకేజీ పైపులు, బూజు పట్టే బేస్‌మెంట్‌లు లేదా సింక్‌ల కింద తడిగా ఉన్న ప్రదేశాలు ఎలుకల జీవనానికి అనువుగా ఉంటాయి.అలాగే మీ సింక్ పైప్ హోల్స్ కూడా వాటిని ఆకర్షిస్తాయి. దీనికి చెక్ పెట్టేందుకు లీకేజీలను వెంటనే సరిచేయండి. తడిగా ఉన్న ప్రాంతాలను సరైన వెంటిలేషన్ లేదా డీహ్యూమిడిఫైయర్‌తో పొడిగా మార్చండి. మీ ఇంటి బయట నీళ్లు మలిస్తే వాటిని వెంటనే క్లియర్ చేసి శుభ్రంగా ఉంచుకోండి.

ఆశ్రయం: ఎలుకలు గూడు కట్టుకోవడానికి , సురక్షితంగా ఉండటానికి అనువైన ప్రదేశాల కోసం వెతుకుతాయి. చిందరవందరగా ఉన్న ప్రాంతాలు, చెక్క కుప్పలు, లేదా నిత్యావసర వస్తువులను నిల్వ చేసిన ప్రదేశాలను అవి ఎక్కువగా ఎంచుకుంటాయి. ఎలుకలు గోడలు లేదా క్యాబినెట్ల లోపల గూడు కట్టుకోవడం ప్రారంభించిన తర్వాత నిజమైన ప్రమాదం ప్రారంభమవుతుంది. ఎలుకలు వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. దీంతో ఒక్క ఎలుక ఉన్న చోట అనేకం పుట్టుకొస్తాయి.

ప్రవేశ మార్గాలు: ఎలుకలు సాధారణంగా ఇళ్లలోకి ప్రవేశించడానికి కష్టపడవు. అవి సులభమైన మార్గాన్ని వెతుకుతాయి. మీ ఇంట్లో పగుళ్లు లేదా రంధ్రాలు ఉంటే, అవి ఎలుకలకు సులభమైన ప్రవేశ మార్గంగా మారుతాయి. పునాదులు, కిటికీలు, తలుపుల చుట్టూ లేదా పైకప్పు వంటి ప్రదేశాలలో ఉండే చిన్న ఖాళీలను కూడా అవి ఉపయోగించుకొని ఇంట్లోకి దూరుతాయి.

ఇంటి బయట చిందరవందరల ప్రదేశాలు: మీ ఇంటి బయట చిందరవందరంగా ఉండే ప్రదేశాలు ఎలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇంటి ముందు ఎక్కువగా చెల్ల, చెట్ల పొదలు ఉంటే అవి ఎలుకలకు ఆశ్రయంగా మారుతాయి. అక్కడి నుంచి అవి ఈజీగా ఇళ్లలోకి చొరబడుతాయి.