
Relationship Tips: గొడవల్లో కలిసి ఉండడం: ఏ బంధంలో అయినా గొడవలు రావడమనేది సర్వసాధారణమైన విషయం. అలాంటి సమయంలో ఒకరికి ఒకరు దగ్గరగా చర్చించుకొని గొడవను పరిష్కరించవచ్చు. నిజానికి ఈ గొడవలే మీ బంధం భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

క్షమాపణ: క్షమించే గుణం అనేది మనలోని సర్వొత్తమ సద్గుణమని చెప్పుకోవచ్చు. మీ ప్రియుడు లేదా ప్రేయసి ఏదైనా తప్పు, మీకు నచ్చని పని చేసినప్పుడు దాన్ని మీరు క్షమించండి. కావాలంటే.. తాను చేసిన ఆ పని మీకు బాధ కలిగించిందని తనకు అర్థమయ్యేఆ వివరించండి. అప్పుడే మీ బంధం బలంగా ఉంటుంది.

ప్రైవసీ ఇవ్వండి: ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఈ కారణంగా మీ ప్రేయసి లేదా ప్రియుడికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా తనకు తన వ్యక్తిగత జీవితాన్ని జీవించే అవకాశం ఇవ్వండి. దానివల్ల మీపై తనకు గౌరవం కూడా పెరుగుతుంది.

ప్రోత్సాహం: మీ లవర్ చేసే ప్రతి పనిలోనూ తోడుగా ఉండండి. మీ తోడు తనకు ఉందనే భరోసా కల్సించండి. ఏమైనా తప్పులు ఉంటే వాటిని మీరే సరిచేయకుండా.. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా అని సూచించండి.

సమయం: ప్రస్తుతం అందరిదీ బిజీ బిజీ లైఫ్. తినడానికే తీరిక లేని బతుకులు మనవి. ఇలాంటి సమయంలోనూ మీ లవర్‌తో కొంత వాల్యూ టైమ్‌ని గడపండి. తనతో సరదాగా సంభాషించండి. ఇలా చేస్తే మీ బంధం ఎంతగానో బలపడుతుంది.