AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బల్లులను తరిమికొట్టే పవర్ ఫుల్‌ వెపన్స్.. కెమికల్స్ అవసరం లేని 5 సులభమైన సహజ చిట్కాలు!

ఇంట్లో గోడలపై తిరిగే బల్లులు చాలామందికి అసహ్యంగాను, భయానకంగానూ అనిపిస్తాయి. ముఖ్యంగా వంటగది లేదా ఆహార పదార్థాల వద్ద ఇవి తిరగడం వల్ల లాలాజలం పడి ఆహారం విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. అయితే, వీటిని తరిమికొట్టడానికి హానికరమైన రసాయనాలు లేదా స్ప్రేలు వాడటం ఇంట్లోని చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు సురక్షితం కాదు. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో బల్లులను ఎలా తరిమికొట్టవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 30, 2026 | 12:18 PM

Share
గుడ్డు పెంకులు: బల్లులను ఇంట్లోంచి తరిమికొట్టడానికి ఇది అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన చిట్కా. గుడ్ల పెంకులను బల్లులు తరచుగా తిరిగే మూలల్లో లేదా కిటికీల వద్ద ఉంచాలి. గుడ్డు పెంకులలో ఉండే ఘాటైన వాసన బల్లులకు అస్సలు పడదు. పైగా ఏదో పెద్ద ప్రాణి లేదా పక్షి ఉందనే భయంతో అవి ఆ ప్రాంతానికి రావు. అయితే, ఈ పెంకులను ప్రతి 2-3 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

1 / 5
ఉల్లిపాయ, వెల్లుల్లి: ఉల్లిపాయలు, వెల్లుల్లిలోని ఘాటైన వాసనను బల్లులు తట్టుకోలేవు. వెల్లుల్లిపాయలను లేదా ఉల్లిపాయ ముక్కలను తీసి గుమ్మాలు, కిటికీల దగ్గర వేలాడదీయవచ్చు. లేదా ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి స్ప్రే సీసాలో పోసి బల్లులు సంచరించే గోడల మూలల్లో స్ప్రే చేస్తే అవి వెంటనే పారిపోతాయి.

2 / 5
మిరియాల స్ప్రే: నల్ల మిరియాల పొడి బల్లులపై చాలా బాగా పనిచేస్తుంది. నీటిలో కొద్దిగా నల్ల మిరియాల పొడి, కారం పొడి కలిపి బాగా కదిలించాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు ఎక్కువగా దాక్కునే స్థలాలు, విద్యుత్ బోర్డుల వెనుక, లైట్ల దగ్గర స్ప్రే చేయాలి. ఈ మిరియాల ఘాటు బల్లుల కళ్ళు, చర్మానికి చికాకు కలిగిస్తుంది, దీంతో అవి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతాయి.

3 / 5
కాఫీ పొడి, పొగాకు: కాఫీ పొడి, పొగాకు పొడిని సమానంగా తీసుకొని, కొద్దిగా నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఈ ఉండలను మ్యాచ్ బాక్స్ లేదా టూత్‌పిక్‌కి గుచ్చి బల్లులు తిరిగే ప్రాంతాలలో ఉంచాలి. ఈ వాసన బల్లులకు విషపూరితంగా మారి వాటిని దూరంగా ఉంచుతుంది.

4 / 5
ఐస్ వాటర్: బల్లులు శీతల రక్త జంతువులు. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తే అవి తమ శరీరాన్ని కదల్చలేవు. కాబట్టి, బల్లి కనిపిస్తే దానిపై బాగా చల్లటి నీటిని చల్లాలి. నీటి చల్లదనానికి అది తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్లు కదల్లేకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో దానిని సులభంగా పట్టుకుని ఇంటి బయట పడేయవచ్చు. ఈ చిన్నపాటి సహజ చిట్కాలను పాటిస్తే, కెమికల్స్ వల్ల అయ్యే ఆరోగ్య సమస్యలు లేకుండా మీ ఇంటిని బల్లుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు!

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా