
పిత్తాశయ సమస్యలు ఉన్నవారు: పసుపు శరీరంలో పిత్త ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎవరికైనా పిత్తాశయ రాళ్ళు లేదా పిత్త వాహిక సమస్యలు ఉంటే, పసుపు పాలు తాగడం వల్ల నొప్పి, అసౌకర్యం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తాగే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

రక్తం పలుచబరిచే మందులు తీసుకునే వ్యక్తులు పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం పట్ల జాగ్రత్తగా ఉండాలి , ఇది రక్తాన్ని పలుచబరిచేదిగా పనిచేస్తుంది. మీరు ఇప్పటికే వార్ఫరిన్, ఆస్ప్రిన్ లేదా క్లోపిడోగ్రెల్ వంటి మందులు తీసుకుంటుంటే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావం లేదా గాయాల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీరు పసుపు పాలకు దూరంగా ఉండడం ఉత్తమం

ఇనుము లోపం ఉన్నవారు: పసుపు అనేది శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తుంది. రక్తహీనత లేదా ఇప్పటికే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారికి, పసుపు పాలు రోజువారీ వినియోగం హానికరం కావచ్చు. అటువంటి వ్యక్తులకు, సాదా పాలు లేదా ఇనుముతో కూడిన పాలు మంచి ఎంపిక.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారు: పసుపులో ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు లేదా ప్రమాదంలో ఉన్నవారు పసుపు పాలు అధికంగా తాగకుండా ఉండాలి.

గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు: పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి సురక్షితమైనదే అయినప్పటికీ.. గర్భిణీలకు, చిన్న పిల్లలకు పాలిచ్చే మహిళలు ఈ సమయంలో ప్రతిరోజూ పెద్ద మొత్తంలో పసుపు తీసుకోవడం లేదా పసుపు పాలు తాగడం మంచిది కాదు. తగిన మొతాదులో తీసుకుంటే ఏం పర్లేదు. కానీ అతిగా తీసుకోవడం వద్ద ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి దీనిని మితంగా లేదా వైద్య సలహాతో తీసుకోవడం ఉత్తమం(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ , నివేదికల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించండి)