
వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత పాటించడం వల్ల చీమలు, కీటకాలను ఎప్పటికీ ఇంటికి దూరంగా ఉంచవచ్చు. ప్రతి వంటగదిలో ఉప్పు ఉంటుంది. చీమల సమస్య తీవ్రంగా ఉంటే ఉప్పునీరు పిచికారీ చేయాలి. ఉప్పునీటి వాసనకు చీమలు దూరంగా పారిపోతాయి.

చీమలు, కీటకాలను వదిలించుకోవాలంటే ఇంట్లో ప్రతి మూలకు వేపనూనె రాసుకోవాలి. ఇది చీమలు, కీటకాలను నిమిషాల వ్యవధిలో తరిమికొడుతుంది. ఈ వేప నూనెను స్ప్రే చేయడం ద్వారా చీమల బెడద తగ్గుతుంది. వేపనూనె వాసనకు చీమలు తిరిగి అటువైపు కూడా రావు.

వంటగదిలోని ప్రతి మూలలో వెల్లుల్లి నూనెను స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వంటగదిలో కీటకాలు రాకుండా ఉంటాయి. ఇంట్లో అన్ని మూలల్లో అక్కడక్కడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చీమలు సహజంగా తగ్గుముఖం పడతాయి.

నిమ్మకాయ నీరు వంటగదిని బాగా శుభ్రం చేస్తుంది. చీమలు, కీటకాలను తరిమికొట్టడంలో నిమ్మరసం సహాయపడుతుంది. కీటకాలు, చీమలు కనిపించే చోట చల్లుకోవటంతో అవి దూరంగా పారిపోతాయి.

నల్ల మిరియాల పొడి, ఎర్ర కారం ఇవి రెండింటిలోనూ ఘాటైన వాసన ఉంటుంది. అందువల్ల ఇవి ఉన్న దరిదాపుల్లోకి చీమలు రావాలంటే భయపడతాయి. అవసరం అనుకున్న చోట కొంచెం కారం పొడి చల్లి పైన కాగితం వేసుకుని మిఠాయిల్లాంటివి పెట్టి కూడా చూడండి. అవి ఇటువైపుగా రానే రావు.