AG Perarivalan: సుప్రీంకోర్టు అనూహ్య తీర్పు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరరివలన్‌ ఎవరో తెలుసా..?

|

May 18, 2022 | 7:14 PM

Who is AG Perarivalan?: రాజీవ్‌గాంధీ హత్య కేసులో అత్యంత కీలక పరిణామం జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 30ఏళ్లుగా తమిళనాడు గవర్నమెంట్‌, స్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది.

AG Perarivalan: సుప్రీంకోర్టు అనూహ్య తీర్పు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరరివలన్‌ ఎవరో తెలుసా..?
Ag Perarivalan
Follow us on

రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi ) హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 30ఏళ్లుకు పైగా జైలుశిక్ష అనుభవిస్తోన్న దోషి, ఏజీ పెరరివాళన్‌కు(AG Perarivalan) విముక్తి కల్పించింది. పెరరివాళన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. పెరరివాళన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. పెరరివాళన్‌ ఇంటి దగ్గర అతని బంధువులు, కుటుంబ సభ్యులు స్వీట్లు తినిపించుకుని సంతోషాన్ని పంచుకున్నారు. పెరిరివాళన్‌ విడుదల కోసం ప్రయత్నించిన స్వచ్ఛంద సంస్థలు బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. సుప్రీం నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్వాగతించారు. పెరరివాళన్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారాయన. ఈ కేసులో మిగిలినవారి విడుదల కోసం ప్రయత్నిస్తామన్నారు స్టాలిన్‌. రాజీవ్‌ హంతకుడు పెరరివాళన్‌ విడుదలను సినీ నటుడు సత్యరాజ్‌ స్వాగతించారు. పెరరివాళన్‌కు జైలు నుంచి విముక్తి కల్పించడం సంతోషంగా ఉందన్నారు సత్యరాజ్‌.

రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి పెరరివాళన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెరరివాళన్‌ విడుదలతో ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఇతర దోషులకు విడుదలకు లైన్‌ క్లియర్ అయింది. పెరరివాళన్‌ విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో కుటుంబసభ్యుల్లో ఆనందం నెలకొంది. పెరరివాళన్‌ ఇంటిదగ్గర స్వీట్లు పంచుకున్నారు. ఆయన విడుదల కోసం ప్రయత్నించిన స్వచ్చంద సంఘాలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇటు చాలా మంది ప్రముఖులు ఆయన విడుదలను ఆహ్వానించారు. పెరరివలన్‌ విడుదల అవడం సంతోషకర విషయం అన్నారు సినీ నటుడు సత్యరాజ్‌.

30 ఏళ్లుగా జైలులోనే ఉంటున్న పెరరివలన్‌ క్షమాభిక్ష కోస ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టుకున్నాడు. కోర్టుల్లో పిటిషన్లు వేశాడు. కానీ ఊరట లభించలేదు. చివరకు సుప్రీంకోర్టు పెరరివలన్‌ పిటిషన్‌ విచారణ జరిపి…విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. పెరరివాలన్‌ విడుదలకు 2016,2018లో తమిళనాడు సర్కార్‌ సిఫార్సు చేసింది. ఆ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి అప్పటి గవర్నర్‌ సిఫార్సు చేశారు. తమిళనాడు సర్కార్‌ సిఫార్సుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. రాష్ట్రపతి దగ్గర పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమిళనాడు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ రాష్ట్రపతికి సిఫార్సు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉందని సుప్రీం బెంచ్‌ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ వాదనను తప్పుపట్టిన న్యాయస్థానం ఇన్నాళ్లు గవర్నర్‌ ప్రసాదించిన క్షమాభిక్షల సంగతేంటి? అని ప్రశ్నించింది. ఇవాళ ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్టికల్‌ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి పెరరివాళన్‌ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.

పెరరివాళన్‌కు 30 ఏళ్లుకు పైగా జైలులో ఉన్నాడని… జైల్లో అతని ప్రవర్తన బాగుందని సుప్రీం తెలిపింది. జైల్లో ఉంటూనే అతని ఉన్నత విద్య పూర్తి చేశాడని గుర్తు చేసింది. 20 ఏళ్ల శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేయాలని గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయని… అలాంటప్పుడు పెరరివాళన్‌ విషయంలో వివక్ష చూపడం సరికాదని అభిప్రాయపడింది.

పెరరివాళన్‌ ఎవరంటే..?

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. ఆనాటి ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌తో పాటు 14 మంది చనిపోయారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో టాడా కోర్టు మరణశిక్ష విధించగా, మరుసటి ఏడాదే పెరరివాళన్‌, మురుగున్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీం నిలిపివేసింది. మరణశిక్షను 2014లో జీవితఖైదుగా మార్చింది. రాజీవ్‌ మర్డర్‌కు వినియోగించిన పేలుడు పదార్ధాలను పెరరివాళన్‌ అందించాడనే నేరంపై అతడిని అరెస్ట్ చేశారు. క్షమాభిక్ష కోసం అనేకసార్లు పిటిషన్లు పెట్టుకున్నాడు పెరరివాళన్‌. 2016, 2018లో పెరరివాళన్‌ను విడుదల చేయాలని తమిళనాడు సర్కార్‌ సిఫార్సు కూడా చేసింది. జైలులో పెరరివాళన్‌ సత్‌ప్రవర్తన కలిగి ఉండటం, ఇప్పటికే 30ఏళ్లు జైలుశిక్ష పూర్తి చేసుకుని ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెరరివాళన్‌ విడుదలతో ఇదే కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఇతర దోషులకు విడుదలకు లైన్‌ క్లియరైనట్లయ్యింది.