AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Nov 24, 2022 | 1:52 PM

ఉత్తర తమిళనాడు, పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్భాగ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలమీదకు చేరింది. సముద్ర మట్టాటిరి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు

AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Weather Alert
Follow us on

ఉత్తర తమిళనాడు, పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్భాగ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలమీదకు చేరింది. సముద్ర మట్టాటిరి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల మీద కొంత మేర ఉండనుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు..

ఉత్తరాంధ్ర, యానాం..

ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి:
ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

దక్షిణాంధ్ర..

ఈ రోజు:
ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.
ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం సంభవించే అవకాశముంది.

రేపు మరియు ఎల్లుండి:
ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

రాయలసీమ..

ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి:
ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.