BJP FOCUSES TELANGANA TWO CRUCIAL DECISIONS BY NARENDRA MODI AMIT SHAH: తెలంగాణ రాజకీయాలు మంచి కాకమీదున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల హడావుడి ఒకవైపు.. ప్రభుత్వ ప్రగతి నివేదికలు మరోవైపు.. జాతీయ పార్టీల ఫోకస్ ఇంకోవైపు.. ఇలా అందరి లక్ష్యం.. ఫోకస్ 2023 ఎన్నికలే. ఆ దిశగా సీరియస్ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే షురూ చేశాయి ప్రధాన పార్టీలన్ని. దాదాపు అన్ని పార్టీలు ఇదే వ్యూహంలో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ కాస్త గట్టిగానే దృష్టి పెడుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ HYDERABADను వేదిక చేసుకోవడం.. ఢిల్లీDELHIలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా తన వ్యూహాన్ని.. ఉద్దేశాన్ని క్రిస్టల్ క్లియర్‌గా చేప్పేసింది బీజేపీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ NARENDRA MODI సహా కీలక జాతీయ నేతలు, కేంద్ర కేబినెట్ మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 300 మందికిపైగా కీలక నేతలు.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. ఇక్కడి నుంచే భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. అందని ద్రాక్షగా మారి ఊరిస్తున్న తెలంగాణను చేజిక్కించుకునేందుకు, పవర్‌లోకి వచ్చి పాగా వేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఆపరేషన్ తెలంగాణ OPERATION TELANGANAకు శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం వెనుక ఏం జరిగింది? ఎలాంటి అంశాలను బీజేపీ అధినాయకత్వం పరిగణలోకి తీసుకుంది ? ఈ అంశాలిప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశాలుగా మారాయి. నిర్ణయాలు తీసుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు.. టైమ్, టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ విషయంలోనూ బీజేపీ హైకమాండ్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. సైలెంట్‌గా ఒక్కో అడుగూ వేసుకుంటూ పోతోంది. కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం నుంచి.. డా. కే.లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపడం వరకు అన్నీ వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.
ఆపరేషన్ తెలంగాణ! BJP ముందున్న అతిపెద్ద, అతి ముఖ్యమైన టార్గెట్లలో ఇది ఒకటి. వాస్తవానికి ఈ లక్ష్యం ఇప్పటి కాదు. 2014లో BJP తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణ మీద స్పెషల్ నజర్ పెడుతోంది. కానీ అనుకున్నస్థాయిలో పార్టీ పుంజుకోలేదు. 2018లో ఆశించింది ఒకటైతే ఫలితం అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది. 2014లో టీడీపీTDPతో పొత్తు కారణంగా గెలుచుకున్న 7 సీట్లలో కేవలం ఒక్కదానినే 2018లో తిరిగి గెలుచుకో గలిగింది కమలం పార్టీ. గోషామహల్ GOSHAMAHAL నుంచి వ్యక్తిగత చరిష్మాతో రాజాసింగ్ RAJASINGH విజయం సాధించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ TRS PARTY ప్రతిష్టాత్మకంగా భావించిన దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాలను గెలుచుకోవడంతో బీజేపీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. అందుకే ఈసారి తగ్గేదే లే అంటున్నారు బీజేపీ నేతలు. స్థానిక నేతల్లో ఉత్సాహం చూసిన హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. 2023లో తెలంగాణ గడ్డపై కాషాయజెండాను రెరరెపలాడించటమే లక్ష్యంగా పక్కా ప్లాన్‌తో..పర్ఫెక్ట్ స్కెచ్‌తో పొలిటికల్ వార్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణలో చీమచిటుక్కుమన్నా సరే బీజేపీ పెద్దలు వాలిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు.. నిలదీసేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. వరిధాన్యం విషయంలో జరిగిన వార్ కావచ్చు.. జీవో 317 వివాదం కావచ్చు.. కరీంనగర్‌లో బండి సంజయ్ జాగరణ దీక్ష- అరెస్ట్ కావచ్చు.. ఖమ్మంలో సాయిగణేష్ ఆత్మహత్య కావచ్చు.. ఇలా ఇన్సిడెంట్ ఏదైనా బీజేపీ హైకమాండ్ సీరియస్‌గానే స్పందిస్తోంది. వెంటనే సీన్‌లోకి దిగిపోతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ముఖ్యులు అంతా క్యూ కడుతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. ఈ ముగ్గురు కీలక నేతలు చెప్పింది ఒకటే. తెలంగాణలో 2023లో మార్పు తథ్యం. 2023లో జెండా పాతేస్తాం. అధికారం మనదే అంటూ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు. అయితే.. పార్టీకి ఇంకా బూస్టప్ అవసరం అనే భావనలో ఉంది హైకమాండ్ అందుకే కొత్తగా రెండు అస్త్రాలను బయటకు తీసింది. పార్టీ పరంగా అత్యంత కీలకంగా భావించే జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ మీటింగ్ కోసం హేమాహేమీలంతా తరలిరానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రధాని మోదీ, అమిత్‌షా ఇతర ముఖ్యనేతలంతా ల్యాండ్ అవుతారు. అంటే జాతీయ పార్టీ మొత్తం భాగ్యనగరంలోనే మకాం వేస్తుందన్నమాట. 2023లో తెలంగాణలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ రాష్ట్ర పార్టీకి అతిపెద్ద బూస్టప్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు . ఇక బీజేపీ వేసిన మరో ఇంపార్టెంట్ స్టెప్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు దేశ రాజధానిలో నిర్వహించడం. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూన్ 2ను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు సెప్టెంబర్ 17న మాత్రమే తెలంగాణ విమోచన దినంగా బీజేపీ ఘనంగా జరిపేది. 2021లో అయితే అమిత్‌షాతో ఏకంగా నిర్మల్‌లో భారీ సభను నిర్వహించింది తెలంగాణ బీజేపీ. కానీ ఈసారి కొత్తగా ఆవిర్భావ వ్యూహాన్ని ఎత్తుకుంది. రాష్ట్రంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని రాజుకుంటోంది పొలిటికల్ ఫైర్. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని అధికార TRS పదేపదే ఆరోపిస్తోంది. ఓవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. హైకమాండ్ పెద్దల వరుస పర్యటనలు.. TRS, KCR టార్గెట్‌గా సూటి విమర్శలు.. ఇవన్ని చూస్తుంటే ఆపరేషన్ తెలంగాణను బీజేపీ అధినాయకత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం అవుతోంది. నౌ ఆర్ నెవర్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు కమలనాథులు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ TELANGANA CHIEF MINISTER TRS CHIEF KCR నేషనల్ పాలిటిక్స్‌పై దృష్టి సారించారు. అదే టైమ్‌లో జాతీయ పార్టీలు తెలంగాణపై దృష్టిసారిస్తున్నాయి. వరుసపెట్టి దండయాత్ర చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి పోయారు. మోదీ, అమిత్‌షా వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. రుణాల విషయంలోనూ కేంద్రం కొర్రీలు పెడుతోంది. కారణం తెలియదు గానీ కేసీఆర్ ఈ మధ్య మాటలు తగ్గించి చేతలకు పని పెట్టారు. వరుసగా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు.. మరో రెండు, మూడు నెలల్లో దేశంలో పెను మార్పు సంభవించనున్నదని జోస్యం చెప్పారు. ప్రతి పార్టీకి ఒక బలం ఉంటుంది. అదే ఆ పార్టీని కాపాడుతూ ఉంటుంది.. అయితే ప్రతిసారి ఆ పాత బలాన్నే నమ్ముకోవడం కరెక్ట్ కాదు. కొత్త అంశాలపైనా ఫోకస్ పెట్టాలి. కొంగొత్తగా బలం పుంజుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఇదే చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలు ఆ పార్టీ బలం. 2014 కావచ్చు..2019 కావచ్చు.. ఈ రెండు ఎలక్షన్లలోనూ… కమలనాథులను గట్టెక్కించింది ఉత్తర భారతమే. ఒకవేళ ఉత్తరాదిన దెబ్బపడితే పరిస్థితి ఏంటి? అందుకే దక్షిణాదిలో బలపడాలని యోచిస్తోంది బీజేపీ నాయకత్వం. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. సౌత్ స్టేట్స్ బీజేపీకి ఎప్పుడూ అందని ద్రాక్షే. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఆ పార్టీదే హవా. కానీ సౌత్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఆ స్పీడ్‌కు బ్రేక్‌లు పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో దక్షిణాదిన కమలం వికసించడం లేదు. ఎన్నోప్రయత్నాల తర్వాత కర్ణాటకలో అయితే కాలుమోప గలిగింది. అయితే 2023లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తామని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇక తమిళనాడు, కేరళ, ఏపీలో పెద్దగా హోప్స్ కనిపించడం లేదు. సౌత్ స్టేట్స్‌లో కమలనాథులు తమ ఆశలన్నీ తెలంగాణపైనే పెట్టుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.! ప్రస్తుతం TRS రెండోసారి అధికారంలో కొనసాగుతోంది. సహజంగానే కాస్త ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నా.. కీలక సమయం వచ్చేసరికి వారిలో ఏ మేరకు ఐక్యత వుంటుందనేది ప్రశ్నార్థకమే. ఈక్రమంలో ఈ గ్యాప్‌ను సరిగ్గా క్యాష్ చేసుకొని..గురిచూసి కొడితే అధికారం వచ్చి వాలిపోతుందన్నది బీజేపీ నేతల ఈక్వేషన్‌లాగా కనిపిస్తోంది. తెలంగాణలో జరిగిన 2014, 2018 ఎన్నికలు చూస్తే BJP ప్రభావం అంతంతమాత్రమే. 2018లో మొదట కేవలం రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాల్లో గెలవడంతో హైకమాండ్‌కు ఆశలు చిగురించాయి. మోదీ చరిష్మా తెలంగాణలో వర్కౌట్ అవుతుందని గ్రహించారు కమలనాథులు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో రఘునందన్, ఈటల కూడా విజయం సాధించడంతో ఇప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీ బలం 3కు పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ సీట్లే సాధించింది బీజేపీ. సో… ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేస్తే తెలంగాణలో కాషాయజెండా ఎగరేయచ్చన్నది BJP ఆలోచన. 2023లో జరిగే తెలంగాణ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఆ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్‌లో జాతీయకార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. అంతే కాదు.. పదవుల విషయంలోనూ ఇక్కడి నేతలకు పెద్దపీట వేస్తోంది.. ఇప్పటికే కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు..! ఇక మరో కీలక నేత లక్ష్మణ్‌కు ఈ మధ్యే యూపీ నుంచి రాజ్యసభ సీటు కేటాయించారు.. వాస్తవానికి గత ఎన్నికల టైమ్‌లో రాజ్యసభకు పంపుతామంటూ…యూపీ, బెంగాల్‌లోని చాలా మంది నేతలకు ప్రామిస్ చేసింది హైకమాండ్. కర్నాటక, గుజరాత్‌లోనూ ఎన్నికలూ ఉన్నాయి.. అయినా వీళ్లందరినీ కాదని…తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చింది.