Davos Summit:పెట్టుబడులు తీసుకురావడమే టార్గెట్.. దావోస్ సమిట్‌కు ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్

|

May 18, 2022 | 8:02 PM

దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించే అంశాల పైన అంతర్జాతీయ సదస్సు కావటంతో ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే సీఎం జగన్ - తెలంగాణ మంత్రి కేటీఆర్ పొల్గొనే సమావేశాలు..

Davos Summit:పెట్టుబడులు తీసుకురావడమే టార్గెట్.. దావోస్ సమిట్‌కు ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్
Davos Summit
Follow us on

ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..(CM Jagan) మరో వైపు తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇద్దరూ ఇప్పుడు ఓకే దారి పట్టారు. ఇద్దరి లక్ష్యం ఒకటే. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో ప్రముఖులు మొత్తం ఒకే వేదిక మీదకు రానున్నారు. దీంతో.. ఇప్పుడు దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించే అంశాల పైన అంతర్జాతీయ సదస్సు కావటంతో ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే సీఎం జగన్ – తెలంగాణ మంత్రి కేటీఆర్ పొల్గొనే సమావేశాలు వాటి ఫలితాల పైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే ప్రధాని సైతం దావోస్ సమిట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఒక విధంగా.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు దావోస్ కేంద్రంగా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి అధికారిక హోదాలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి వరకు.. తెలంగాణలో తమ హయాంలో భారీ ఎత్తున పరిశ్రమలు – పెట్టుబడుల విషయం లో సక్సెస్ అయ్యామని చెబుతున్న మంత్రి కేటీఆర్.. అందులో భాగంగానే మరో దావోస్ లో అడుగు వేస్తున్నారు.

కేటీఆర్ యూకే టు దావోస్ బుదవారం నుంచి మొదలు పెట్టారు. ఆయనకు బ్రిటన్‌లో ఘన స్వాగతం లభించింది. యూరోప్‌ పర్యటనలో భాగంగా ముందుగా లండన్‌ చేరుకున్న కేటీఆర్‌కు విమానాశ్రయంలో ఎన్‌ఆర్‌ఐ తెరాస-యూకే విభాగం, ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. కేటీఆర్‌తో ఫోటో దిగేందుకు వీరంతా పోటీ పడ్డారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కేటీఆర్‌కు బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ కూడా స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌ ఇన్వెస్ట్‌ తెలంగాణ మీట్‌లో పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు.. వేగంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అక్కడి వ్యాపారవేత్తలను, ఎన్నారైలను కోరారు కేటీఆర్‌. యూకే పర్యటన తర్వాత మంత్రి కేటీఆర్‌ దావోస్‌ వెళ్లనున్నారు.

సీఎం జగన్..ఏపీలో సంక్షేమం పైన ఇప్పటి వరకు ప్రధానంగా ఫోకస్ చేయగా.. ఇప్పుడు ఏపీకి పెట్టుబడల దిశగా దావోస్ లో 30 మంది ఎమ్మెన్సీ ప్రతినిధులతో సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ దావోస్ లో ఉంటారు. సీఎం జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన..అమర్నాధ్..అధికారులు సీఎంతో పాటు ఉంటారు. అయితే, ఏపీలో పెట్టుబడుల అవకాశాలు.. అక్కడ ఉన్న అనుకూల పరిస్థితుల పైన వివరించి.. పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించనున్నారు.