Viral Video: స్వీట్లంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకుకూడా స్వీట్లను చూస్తే నోరు ఊరుతుందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలాఉంటే.. కస్టమర్లను ఆకర్షించేందుకు గానూ ప్రతి స్వీట్స్ షాపులో స్వీట్లను దుకాణాదారులు ఒక గ్లాస్ డిస్‌ప్లే లో స్వీట్స్‌ని చూడచక్కగా అలంకరిస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన స్వీట్స్ షాపులో ఒక క్రిస్టల్ డిస్‌ప్లే మాదిరి సెటప్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే, ఆ స్వీట్లను చూస్తే ఒ కుక్కకు కూడా నోరూరినట్లుంది. ఇంకేముంది.. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన ఆ కుక్క నేరుగా స్వీట్స్ ఉన్న బాక్స్‌లోకి దూరింది. సైలెంట్‌గా నచ్చిన స్వీట్లను తినేసింది. చివరికి కుక్కను గమనించిన షాపు యజమాని.. షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని స్వీట్స్ బాక్స్‌లోకి దూరిన కుక్కను బయటకు వెళ్లగొట్టేందుకు దాన్ని బెదిరించాడు.
భయపడిపోయిన కుక్క.. ఆ స్వీట్స్ బాక్స్ మొత్తం కలియతిరిగింది. దాంతో అ బాక్స్‌లో ఉన్కన స్వీట్లన్నీ చిందరవందరగా కిందపడిపోయాయి. మొత్తానికి ఆ షాపు యజమాని కుక్కను బయటకు తరిమేశారు. కాగా, ఈ తతంగాన్ని అంతా స్వీట్ షాప్‌నకు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ‘ఆ కుక్కకు స్వీట్లంటే చాలా ఇష్టం అనుకుంటా.. అందుకే నేరుగా షాప్‌లోకే చొరబడింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘మొత్తానికి తన ఆశ నెరవేర్చుకుంది’ అటూ మరొక నెటిజన్ కామెంట్స్ చేశారు. ఇలా ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
Viral Video:
Also read:
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..