Viral Video: ఎండ వేడిమిని తాళలేక నీరు తాగడానికి నది ఒడ్డుకు వెళ్లిన ఓ శునకం.. నీటిలోని మొసలికి బలి అయ్యింది. అక్కడే కొందరు ఈ ఘటనను వీడియో తీశారే తప్ప.. ఆ శునకాన్ని రక్షించాలని మాత్రం భావించలేదు. ఫలితంగా నదిలోని మొసలి ఎకాఏకిన ఆ శునకాన్ని మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం చంబల్‌లోని కలియసోట్ డ్యామ్ బ్యాక్ వాటర్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చంబల్ నదిపై ఉన్న కలియసోట్ డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద ఓ శునకం నీరు తాగేందుకు వచ్చింది. అలా లోపలికి వెళ్లిన శునకం నీరు తాగుతుండగా.. మొసలి గమనించి శునకం వైపు కదిలింది. అయితే, అక్కడే ఉన్న కొందరు నదిలో మొసలి కదలికలను గమనించారు. వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేశారు. నది ఒడ్డున ఉన్న శునకం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ నీటిలో సేద తీరుతోంది.
అంతలోనే దానిని సమీపించిన మొసలి.. అమాంతం ఆ శునకాన్ని మింగేసింది. అయితే, ఈ ఘటనను గమనించిన వ్యక్తులు.. మొసలి కదలికలు మొదలు శునకాన్ని మింగడం అంతా వీడియో తీశారే తప్ప ఆ కుక్కను కాపాడాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఆ కుక్కను కొంచెం అలర్ట్ చేసినా అక్కడి నుంచి అది ప్రాణాలతో బయటపడేది. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియో తీసిన వారిని తిట్టిపోస్తున్నారు. కుక్క ప్రాణాలను కాపాడాల్సిందిపోయి.. సినిమాలా చూస్తారా? అంటూ మండిపడుతున్నారు. మనిషిలో రోజు రోజుకు మానవత్వం అనేదే లేకుండా పోతోందని ధ్వజమెత్తుతున్నారు. ఈ వీడియోపై డ్యామ్ అధికారులు సైతం స్పందించారు. డ్యామ్‌లో మొసళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయని, ఎండాకాలం కావడంతో నది లోపల వేడిమిని తట్టుకోలేక ఆ మొసళ్లు నది ఒడ్డుకు వస్తాయని అన్నారు.
Kaliyasot Dam, Bhopal.
Dog hunting by crocodile ?, captured in camera.
If a dog had seen hunting of a human being, he would have tried to save him. But these were humans, having fun in making videos, rather than saving the poor dog. pic.twitter.com/UD317tZw7S
— Sandeep Shivhare (@AmazingShivhare) May 26, 2021
Also read:
EK Mini Katha Review: కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత ..ఈ ‘ఏక్ మినీ కథ’