Viral Video: బామ్మ రాక్స్.. మనమడు షాక్.. మరీ ఇంత చీటింగ్ అయితే ఎలా బామ్మా!.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియా యాప్స్, వీడియో యాప్స్ నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలో..

Viral Video: బామ్మ రాక్స్.. మనమడు షాక్.. మరీ ఇంత చీటింగ్ అయితే ఎలా బామ్మా!.. ఫన్నీ వీడియో మీకోసం..
Viral Photo
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 4:10 PM

Viral Video: సోషల్ మీడియా యాప్స్, వీడియో యాప్స్ నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలో, ప్రాంక్ వీడియోలు ఉంటాయి. చాలా మంది ఆ వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు. మనసు బాలేని సమయంలో గానీ, టైమ్‌పాస్ కానప్పుడు గానీ ఆ వీడియోలను చూసి సరదాగా గడిపేస్తుంటారు. అయితే, ఇప్పుడు మేం చెప్పబోయే వీడియో చూస్తే మీరు కచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకు ఆ బామ్మ తన మనవడికి ఆ రేంజ్‌లో షాక్ ఇచ్చింది మరి. ఆమె ఇచ్చిన షాక్‌తో మనవడు బిత్తరపోయాడు.

ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో ఒక బామ్మ స్టూల్‌పై నిల్చుని ఒక కర్రసాయంతో రూమ్ సీలింగ్‌కు ప్లాస్టిక్ టబ్‌ను అదిమిపెట్టి పట్టుకుంది. అంతలో ఆమె మనవడు వచ్చాడు. ఏం చేస్తున్నావ్ బామ్మా అంటూ అమాయకంగా అడిగాడు. దాంతో ఆ బామ్మ దొరికాడు బకరా అనుకుని.. ఈ కర్రను పట్టుకో అంటూ ఆ స్టిక్‌ని అతనికి అప్పగిస్తుంది. దాంతో ఆ యువకుడు కర్రను రెండు చేతులతో అదిమి పట్టుకుంటాడు. దొరికిపోయాడు దొంగ అంటూ ఆ బామ్మ.. యువకుడి జేబులోంచి పర్స్‌ని తీసుకుంటుంది. అలా అతని జేబు నుంచి తీసుకున్న పర్స్‌ని తన బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు వెళ్తిపోతుంది. అది చూసి ఆ మనవడు షాక్ అవుతాడు. కర్రను వదిలేస్తే పైన ఉన్న ప్లాస్టిక్ టబ్ తలపై పడుతుంది. దాంతో చేసేదేం లేక.. బామ్మ తన పర్స్‌ని ఎత్తుకెళ్తున్నా చూస్తూ ఉండిపోయాడు పాపం.

కాగా, దీన్నంతా కెమెరాలో రికార్డ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ పన్నీ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. బామ్మ ఇచ్చిన షాక్‌కి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. బామ్మ రాక్స్.. మనవడు షాక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘మరీ ఇంత చీటింగ్ అయితే ఎలా బామ్మా’ అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఎంతో ఫన్నీగా ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

Also read:

Karthikeya: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్