Viral Video: నిజంగా కొన్ని జంతువులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాటి తెలివితేటలు అమోఘం అనిపిస్తుంటాయి. ఇక వాటి అల్లరి చెప్పనలవి కానిది. మనుషులతో ఇట్టే కలిసిపోయే వాటి సాన్నిహిత్యం మనిషి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. జంతువులతో స్నేహం.. ప్రపంచంలో ఏదీ ఇవ్వలేని సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది తమ తమ ఇళ్లలో జంతువులను, పక్షులను పెంచుకుంటారు. వాటితో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇక జూపార్క్‌లలో ఉండే జంతువులతో అక్కడ పని చేసే సంరక్షకులు స్నేహం చెప్పలేనిది. వాటి ఆలనా, పాలనా చూస్తుండటంతో వాటితో వారికి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అందుకే వారు ఏం చెబితే.. అవి ఆ పనిని చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మనం ఎన్నో రకాల తాబేళ్లు చూసుంటాం. అంగుళం సైజు తాబేళ్లు మొదలు.. భారీ తాబేళ్లు భూమిపై ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ భారీ తాబేలుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తాబేలుకు ఆహారంగా ఆకు కూరగాయలు తినిపిస్తుంటాడు. ఆ సందర్భంగా తాబేలు, ఆ వ్యక్తి చాలా సరదాగా వ్యవహరించారు. ఆ వ్యక్తిలో తాబేలుకు ఆకు కూరగాయలను ఆహారం అందించగా.. తాబేలు అతనికి హై-ఫై ఇచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాబేలు హై-ఫై ఇస్తుండగా పక్కనే ఉన్న మరో వ్యక్తి దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘‘హై-ఫై లలో తాబేలు హై-ఫై బెస్ట్’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 10 గంటల్లోనే లక్షన్నరకు పైగా వ్యూస్ రాగా, లక్ష వరకు లైక్స్ వచ్చాయి. తాబేలు హై-ఫై ఇవ్వడాన్ని చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఆసక్తికరమైన వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Also read:
Weight Lose Tips : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే పడుకునే ముందు ఈ పానీయాలు తీసుకోండి..