తోడేళ్లు తిరిగి జనావాసాల్లోకి వస్తున్నాయా..? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా..?

|

Apr 09, 2021 | 5:41 AM

Wolves Return to Netherlands : ఒక శతాబ్దం క్రితం తోడేళ్ళను అనేక యూరోపియన్ దేశాల ప్రజలు వేటాడారు. కానీ అవి ఖండాంతర ప్రధాన భూభాగం గుండా సంచరించి ఇప్పుడు మళ్లీ

తోడేళ్లు తిరిగి జనావాసాల్లోకి వస్తున్నాయా..? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా..?
Wolves Return
Follow us on

Wolves Return to Netherlands : ఒక శతాబ్దం క్రితం తోడేళ్ళను అనేక యూరోపియన్ దేశాల ప్రజలు వేటాడారు. కానీ అవి ఖండాంతర ప్రధాన భూభాగం గుండా సంచరించి ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. 2015 నుంచి నెదర్లాండ్‌లో అప్పుడుప్పుడు తోడేళ్ల ఆనవాళ్లు కనిపించేవి. నెదర్లాండ్‌లోని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకృతి రిజర్వ్‌లో రెండు తోడేళ్లను ట్రాక్‌ చేశారు. వాటి అడుగులు, స్కాట్ (బిందువులు) సేకరించి వాటి డిఎన్‌ఎను గుర్తించారు. ఈ ఫారెస్ట్ ఇప్పుడు తోడేళ్ల నివాసంగా మారిందన్నారు.

అయితే ఈ రెండు తోడేళ్లలో ఒకటి ఆడ తోడేళని గుర్తించామన్నారు. అది ఆరు నెలలు ఇక్కడ ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు కనుగొన్న ప్రదేశం వాటి స్థావరంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మిగిలిన మగ తోడేలు ఈ ప్రాంతం చుట్టుపక్కల తిరుగుతున్నట్లు ఆధారాలు లభించాయన్నారు. ఈ సందర్భంగా వారు ఆశ్చర్యకరమైన ఓ నిజాన్ని వెల్లడించారు. మరికొన్ని నెలల్లో తోడేళ్లు ఒక గుంపుగా ఏర్పడతాయని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని తోడేళ్ళను పరిశోధించడానికి నియమించబడిన వాగెనిన్గెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త హ్యూ జాన్స్‌మన్.. తోడేళ్లు తిరిగి రావడం వల్ల పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని అంటున్నాడు.

IPL 2021: ఐపీఎల్ జోష్‌‌లో ఏ జట్టు కెప్టెన్‌కు పారితోషకం ఎక్కవ..? ఎవరికి తక్కువ..? ఓ లుక్కేద్దాం..!

CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం

రెట్టింపు కామెడీ డోసుతో రానున్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో కలిసి నవ్వులు పంచనున్న అనుదీప్..

సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..