ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

|

Nov 28, 2021 | 6:53 PM

Sky Details: ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంటుందని అడిగితే చాలామంది సముద్రం నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆకాశం కూడా నీలిరంగులో ఉంటుందని చెబుతారు.

ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
Sky
Follow us on

Sky Details: ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంటుందని అడిగితే చాలామంది సముద్రం నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆకాశం కూడా నీలిరంగులో ఉంటుందని చెబుతారు. కానీ ఇది వాస్తవం కాదు. శాస్త్రీయ మార్గాల ద్వారా చూస్తే దీని కనెక్షన్ సూర్యకిరణాలతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా వాతావరణంలో చిన్న చిన్న ధూళికణాలు, మట్టి కణాలు ఉంటాయి. సూర్యు కిరణాలు వీటిపై పడినప్పుడు అవి ఏడు రంగులుగా విడిపోతాయి. ఈ ఏడు రంగుల్లో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటాయి. నీలిరంగు అతి తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. అదే సమయంలో ఎరుపు రంగు ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. తత్ఫలితంగా నీలిరంగు ఆకాశంలో ఎక్కువగా విస్తరించి ఉంటుంది. అందుకే పగటిపూట ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆకాశం రంగు నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం కూడా కాంతి కిరణాలే. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో సూర్యుని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎరుపు, నారింజ రంగులు నీలం, ఆకుపచ్చ కిరణాల కంటే ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. అందువల్ల ఆకాశం రంగు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. సముద్రం నీలి రంగులో ఉండటం అందరు చూసే ఉంటారు. కానీ దగ్గరగా వెళ్లి చూస్తే అది నీలి రంగులో ఉండదు. దీనికి కారణం కూడా సూర్య కిరణాలే.

పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు నీరు కాంతి నుంచి వెలువడే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అవి నీలి కిరణాలుగా ప్రతిబింబిస్తాయి. ఈ కారణంగా సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది నీలం కాదు. సూర్యుడు చాలా శక్తిమంతుడు అని శాస్త్రం చెబుతోంది. సూర్యుడు ప్రతి సెకనుకు 100 బిలియన్ల అణు బాంబులు విడుదల చేసే శక్తిని విడుదల చేస్తాడు. దీనికి ఉదాహరణ సౌరశక్తి. సౌర ఫలకాల ద్వారా సూర్యుని శక్తి నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికీ కరెంటు రాని గ్రామాల్లో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం విశేషం.

IND vs NZ 1st Test, Day 4: నాలుగో రోజు ముగిసిన ఆట.. 234 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌..

Mobil Phones: ఈ 4 ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో వస్తాయి.. ధర కేవలం రూ. 7299 మాత్రమే..

రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్‌ ఆటగాడు చేయలని ఫీట్‌ సాధించాడు..