AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ బాబోయ్.. యువతికి చుక్కలు చూపించిన కోడిపుంజు.. చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో

Chicken vs Girl Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే..

Viral Video: అమ్మ బాబోయ్.. యువతికి చుక్కలు చూపించిన కోడిపుంజు.. చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో
Viral News
Shaik Madar Saheb
|

Updated on: Dec 16, 2021 | 6:57 PM

Share

Chicken vs Girl Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫన్నీ వీడియోలు చూసిన నెట్టిజన్లు తెగనవ్వుకుంటున్నారు. తాజాగా నెట్టింట ఓ కోడి పుంజు వీడియో.. తెగ వైరల్ అవుతోంది. దీనిని చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం. ఎందుంకంటే.. కొంతమంది చిన్న జంతువులను తేలికగా తీసుకొని వాటిని ఆటపట్టించడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వారు ఈ వీడియోను చిన్న జంతువు ఏం చేస్తుందో అర్ధమవుతుంది.

తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో.. కోడిపుంజును భయపెట్టడానికి ఓ యువతి ట్రై చేసింది. కానీ సీన్ రివర్స్ కావడంతో యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక అమ్మాయి పార్క్‌లో నిలబడి ఉన్న కోడిపుంజును భయపెట్టడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అమ్మాయి నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కోడి దగ్గరికి వెళ్లి భయపెట్టాలని చూస్తుంది. కానీ ఇది కాస్త రివర్స్ అయింది. అదే ధైర్యం చేసి యువతి వెంట పడుతుంది. దీంతో యువతి కేకలు వేసుకుంటూ అక్కడినుంచి పరుగులు తీస్తుంది. కోడిని భయపెట్టాలని చూడటంతో అది అమ్మాయిపై తిరగబడిందని.. ఎప్పుడూ కూడా చిన్న జంతువులను తక్కువగా అంచనా వేయొద్దంటూ సూచిస్తున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by DEMI BAGBY (@demibagby)

వీడియో చూసిన నెటిజన్లు.. యువతి భయపడి పారిపోతుందని అస్సలు ఊహించలేదని పేర్కొంటున్నారు. కాగా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను demibagby అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వీక్షించారు. దీంతోపాటు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral News: బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తోన్న ప్లంబర్‌కు ఊహించని షాక్.. బద్దలకొట్టి చూడగా ఫ్యూజులు ఔట్!

Winter Food: చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోవాల్సిందే..