భార్యకు కాలునొప్పి అని ఆస్పత్రికి తీసుకెళ్తే.. భర్తను బార్‌కెళ్లమన్నాడు డాక్టర్.. సీన్ కట్ చేస్తే..

|

Oct 21, 2022 | 2:04 PM

ఓ మహిళ రెండు నెలలుగా కాలు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె భర్త సదరు మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడున్న డాక్టర్..

భార్యకు కాలునొప్పి అని ఆస్పత్రికి తీసుకెళ్తే.. భర్తను బార్‌కెళ్లమన్నాడు డాక్టర్.. సీన్ కట్ చేస్తే..
Doctor's Prescription
Follow us on

ఓ మహిళ రెండు నెలలుగా కాలు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె భర్త సదరు మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడున్న డాక్టర్ ఆమెను పరిశీలించి ప్రిస్క్రిప్షన్‌ రాసిచ్చాడు. ఇంతకీ ఆ డాక్టర్ రాసిచ్చింది చూసి ఆ దంపతుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇంతకీ అందులో ఏముందంటే..

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిసూర్‌కు 44 ఏళ్ల ప్రియ గత రెండు నెలలుగా కాలు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె భర్త అనిల్ స్థానికంగా ఉన్న దయా ఆస్పత్రికి సదరు మహిళను తీసుకెళ్లాడు. అక్కడున్న డాక్టర్ ప్రియ కాలును పరిశీలించి.. ఎక్స్‌రే తీయించమని చెప్పాడు. ఇక ఆ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం వేరే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించాడు. అయితే తన భార్యకు కాలు నొప్పి విపరీతంగా ఉందని.. దాన్ని నుంచి ఉపశమనం పొందేందుకు ఏవైనా మందులు రాయాలని సదరు డాక్టర్‌ను ఆమె భర్త ఆనిల్ కోరాడు. ఆ డాక్టర్ వారికి ప్రిస్క్రిప్షన్‌ రాసిచ్చాడు.

అనంతరం ఆ దంపతులు దాన్ని తీసుకుని మందుల షాపుకు వెళ్లగా.. అక్కడున్న వారు ఆ ప్రిస్క్రిప్షన్ చదివి నవ్వుకున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘బెడ్ రెస్ట్ వద్దు. ఏదైనా సమస్య ఉంటే భర్త బార్‌కు వెళ్లాలి’ అని రాసి ఉంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన అనిల్.. డాక్టర్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. కాగా, దయా ఆసుపత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌ను విధుల నుంచి తొలగించింది. ఘటనపై పూర్తి విచారణ చేపట్టామని.. అనంతరం డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.