Rare Shieldtail Snake: నల్లమల ఫారెస్ట్‌లో అరుదైన పాము.. దాని వివరాలు తెలిస్తే షాకవుతారు..సొరంగాలను తవ్వుకుంటాయి

|

Feb 23, 2021 | 9:01 PM

నల్లమల ఫారెస్ట్‌లో అరుదైన పాము ప్రత్యక్షమైంది..నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట రేంజ్‌ పరిధిలో ఈ రేర్‌ స్నేక్‌ను గుర్తించారు ఫారెస్ట్‌ అధికారులు.

Rare Shieldtail Snake: నల్లమల ఫారెస్ట్‌లో అరుదైన పాము.. దాని వివరాలు తెలిస్తే షాకవుతారు..సొరంగాలను తవ్వుకుంటాయి
Follow us on

Rare Shield Tail Snake: నల్లమల ఫారెస్ట్‌లో అరుదైన పాము ప్రత్యక్షమైంది..నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట రేంజ్‌ పరిధిలో ఈ రేర్‌ స్నేక్‌ను గుర్తించారు ఫారెస్ట్‌ అధికారులు. గుండం పరిసరాల్లో కనిపించిన ఈ పామును షీల్డ్‌ టైల్‌ స్నేక్‌ గా పిలుస్తారని, దీనీ రేంజ్‌మామూలుగా ఉండదని చెప్పారు.

నల్లమల అడవులు. ఎన్నో జీవజాతులకు ఆలవాలం. మరెన్నో వన్యప్రాణులకు ఆవాసంగా నల్లమల అడవులు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని ఇంకెన్నో ప్రాణులకు ఆవాసంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం… గుండం పరిసరాల్లో ఈ షీల్డ్‌ టైల్‌ స్నేక్‌ జాతికి చెందిన పాము అటవీశాఖ అధికారుల కంటపడింది. దక్షిణ భారతదేశంలో ఈ పామును షీల్డ్‌ టైల్‌ స్నేక్‌ అనే పేరుతో పిలుస్తారని అటవీశాఖ రేంజ్‌ అధికారి ప్రభాకర్‌ తెలిపారు. యూరో ఫెల్డీటే కుటుంబానికి చెందిన యూరోఫెల్డ్సీ ఎల్‌ఏటీ దీని శాస్త్రీయనామం అన్ని చెప్పారు. ఈ జాతి పాము నల్లమలలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చన్నారు. షీల్డ్‌టెయిల్స్ హానిచేయనివి, ప్రాచీనమైనవి అని చెప్పారు. ఇవి 25 – 50 సెం.మీ పొడవు వరకు పెరుగుతాయని.. పాములు తమ సొంత సొరంగాలను తవ్వి భూగర్భంలో నివసిస్తాయని పాము రక్షించే జాదర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర లెక్చరర్ డాక్టర్ సదాశివయ్య అన్నారు.

పాముల ప్రత్యేక అధికారి సదాశివయ్య ఈ పాముపై ప్రత్యేక పరిశోధనలు చేసి అరుదైన జాతుల్లో ఒకటిగా గుర్తించినట్లు తెలిపారు. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవు ఉండి భూమి బొరియల్లో నివసిస్తాయని చెప్పారు. ఆహారం కోసం కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బైటకొస్తాయని వివరించారు.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు