Himachal Pradesh Landslide : హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి భీభత్సం సృష్టించింది. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ దగ్గర పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అవి ఎంత తీవ్రతతో ఎత్తైన కొండమీద నుంచి కిందకి పడ్డాయంటే, ఒక్క రాయి తీవ్రతకే నదిమీద కట్టిన బ్రిడ్జి ఒక్కదెబ్బకి కూలిపోయింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా కొండ దిగువున ఉన్న వాహనాలు, విశ్రాంతి గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కొండచరియలు విరిగిపడుతోన్న దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఈ ఉత్పాతం ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జరిగినట్టు సమాచారం. కాగా, వారం రోజులుగా హిమాచల్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమాదాలకు గురయ్యే పలు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకూడదని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని క్షతగాత్రులకు వైద్య సహయాన్ని అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అబిద్ హూస్సేన్ పేర్కొన్నారు.
Read also : Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి