Monkeys Hulchul: మా ఊరిపై కోతులు పగబట్టాయి అని చెబుతున్నారు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం బోడినాయుడి పల్లె వాసులు. అందుకు ఓ కారణం కూడా ఉందడోయ్. కోతులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడి చేయడంతో పాటు ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉండటంతో.. ఆ పల్లె వాసులు ఓపిక నశించింది. దీంతో ఇటీవల ఊర్లో జనాలు అంతా ఏకమై 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీప్రాంతానికి తోలారు. అయితే అక్కడ కోతులు ఎక్కువకాలం నిలవలేదు. మూడంటే మూడు రోజుల్లోనే తిరిగి ఊర్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే అవి వచ్చీరాగానే జనాలపై పగబట్టినట్లు ప్రవర్తించాయి.
ఆ ఊర్లోని వాసు అనే వ్యక్తి ఫోన్ ఎత్తుకెళ్లాయి. ఊళ్లోనే ఓ చెట్టుపైకి చేరి ఓ ఆట ఆడుకుంటున్నాయి. పాపం మొబైల్ కోసం స్థానికులు, వాసు అక్కడే ఎదురుచూస్తున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలు ఊపయోగించినా.. కోతులు బెట్టు వీడటం లేదు. మొబైల్ చెట్టుపైనే పెట్టుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ఆ వ్యక్తి మొబైల్ కోసం పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా మారాయి. మరి వానరాలు మనసు ఎప్పుడు మారుతుందో చూడాలి.
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?