Maharashtra national bird: ఇదొక వింత పక్షి.. చూడ్డానికి పావురంలా ఉన్నా ఇది నేలపై అస్సలు వాలదు. దీన్ని పసుపు కాళ్ల పచ్చ పావురం (yellow-footed green pigeon) అంటారట. అయితే దీని సైంటిఫిక్ నేమ్ మాత్రం ట్రెరాన్ ఫోనికాప్టెరస్ (Treron phoenicopterus). ఈ పక్షి… మన భారత దేశంలో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మహారాష్ట్రకు రాష్ట్ర పక్షి. విచిత్రమేంంటే మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు. ఇవి పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ లో కూడా కనిపిస్తాయి.
చూడటానికి పావురాల లాగా ఉన్నా… ఇవి వాటిలాగా గింజలు తినవు. చిలుకల లాగా పండ్లు, , పూల మొగ్గలు, ధాన్యాల వంటివి తింటాయి. గుంపులుగా ఎగురుతాయి గానీ… నేలపై అస్సలు వాలవు. పగటివేళ మాత్రమే కనిపించే ఇవి… దట్టమైన అడవుల్లో అతి ఎత్తైన చెట్లపైన జంటలుగా నివసిస్తాయి. కనిపిస్తాయి. మిగతా పక్షుల లాగే… గడ్డి పరకలు, ఆకులతో గూళ్లు కట్టుకుంటాయి. అయితే ఇవి నేలపైన ఎందుకు వాలవు అనేది మనకే కాదు శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావట్లేదు. పావురాలు, చిలుకలు నేలపై వాలతాయి కదా.. మరి ఆ లక్షణాలతో ఉన్న ఈ పక్షులు ఎందుకు వాలవన్నది తేలాల్సి ఉంది.
ఓ అంచనా ప్రకారం వీటికి నేలపై వాలే అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే… ఆహారం కోసం పండ్లను తింటున్నాయి. నీటి కోసం ఇవి చెట్లపై ఆధారపడుతున్నాయి. పండ్లలో ఉండే నీటిని, చెట్లపై పడే మంచు నుంచి తయారయ్యే నీటి బిందువుల్ని ఈ పక్షులు తాగుతున్నాయి. అందువల్ల వీటికి నేలపై వాలాల్సిన అవసరం రావట్లేదని అంటున్నారు. ఇక ఈ పక్షులకు మొహమాటం ఎక్కువ. ఎప్పుడూ సైలెంట్ గా, డల్ గా ఉంటాయి. చిన్న అలికిడి అయినా ఇక అక్కడ ఉండకుండా… ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్లిపోతాయి. మనుషులంటే వీటికి భయం. వాళ్లను చూస్తే చాలు పారిపోతాయి. నేలపై వాలకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.. అందుకే ఈ పక్షులు 26 ఏళ్ల వరకూ జీవిస్తాయి.
Also Read: