కోహినూర్… అద్భుతమా..? అరిష్టమా..? చరిత్ర ఏం చెబుతోంది?

వజ్రం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడానికి ముందు అనేక సార్లు పాలకులు, స్థానాలను మార్చింది. దాని చుట్టూ ఎన్నో కథలు, ప్రచారాలతో ముడిపడి ఉన్న ఈ కోహినూర్‌ వజ్రం రాజులకు కలసి రాలేదని, దానిని సొంతం చేసుకున్న వారు ఎవరూ ప్రశాంతంగా ఉన్న ఆనవాళ్లు కనిపించలేదనే వాదనలు ఎక్కువయ్యాయి. దాంతో ఈ విషయం రాణి విక్టోరియాకు చేరింది. ఈ వజ్రం ధరించిన వారంతా అకాల మరణానికి గురవుతున్నారని తెలిసి.. అప్పుడే ఒక వీలునామా రాయించారట..

కోహినూర్... అద్భుతమా..? అరిష్టమా..? చరిత్ర ఏం చెబుతోంది?
Kohinoor Diamond

Updated on: Jun 24, 2024 | 10:55 AM

కోహినూర్ వజ్రం..ఈ పేరు వినని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. అంతే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక వివాదాస్పదమైనది కూడా..దీనికి ఆ పేరు కూడా ఓ ఆశ్చర్యం, విస్మయంలోంచి వచ్చింది. ఒక పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్‌.. ‘కోహ్‌ ఇ నూర్‌’ అని పిలిచాడు… దాంతో ఈ వజ్రానికి కోహినూర్‌ వజ్రం అనే పేరు అలాగే స్థిరపడింది. అంతేకాదు.. ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది.. ఈ వజ్రం దొరికింది మన భారతదేశంలోనే అయినప్పటికీ దీనికోసం అనేక యుద్ధాలు, పోరాటాలు, ఎత్తులు, జిత్తులు జరిగాయి. ఈ వజ్రం శతాబ్దాలుగా అనేక రాజులు, మొఘల్‌ వంశస్తుల చేతులు మారుతూ.. చివరకు బ్రిటిష్ వారి ఆధీనంలోకి చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. బ్రిటిష్ రాచరిక ఆభరణాల్లో భాగంగా బ్రిటీష్ క్వీన్ కిరీటంలో అలంకరించబడింది. అలాంటి కోహినూర్..ఒక శాపగ్రస్తమైనది అంటే నమ్మగలరా..? దీన్ని ధరించినవారు అనతి కాలంలోనే చనిపోతారనేది కూడా ప్రచారంలో ఉంది. కోహినూర్‌ ఒక అరిష్టమని కూడా అంటుంటారు..? ఇవన్నీ నిజలేనా..? వాస్తవంగా కోహినూర్ ఎక్కడ దొరికింది.? ఇప్పుడు దీని విలువ ఎంత..? బ్రిటన్‌ ఎందుకు వెళ్లింది..? దీనిపై అసలు హక్కుదారులు ఎవరు..? శాపగ్రస్తమని ప్రచారంలో ఉన్న ఈ కోహినూర్‌ కహాని ఏంటి? వాస్తవానికి ఈ కోహినూర్‌ వజ్రం దొరికింది ఆంధ్రప్రదేశ్‌ లోనే అని ఆధారాలు చెబుతున్నాయి....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి