ప్రపంచం వేగంగా పురోగతి సాధిస్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల మన రోజువారీ పనులు కూడా చాలా తేలికగా జరుగుతాయి. కానీ వేగంగా నడుస్తున్న జీవితంలో, మనం పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోయాము. మన భూమి సమతుల్యత వేగంగా క్షీణించడానికి ఇదే కారణం. పర్యావరణానికి దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి పర్యవరణానికి హాని చేస్తే.. కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాలి.
ఇలాంటి సందర్భాలు తలెత్తిన తర్వాత తరుచుగా పర్యావరణవేత్తలు అనేక హెచ్చరికలు జారీ చేశారు. కానీ మెజార్టీ ప్రజలు పట్టించుకునే పరస్థితుల్లో లేరు. తాజాగా స్కాట్లాండ్ లో ఓ నది నీరు అకస్మాత్తుగా యాసిడ్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలోని పోల్మాడి బర్న్ నది నీరు అకస్మాత్తుగా పసుపు రంగులోకి మారిపోయింది. దీని ఫోటోలు చాలా చోట్ల షేర్ చేయబడ్డాయి.
ప్రజలు మొదట్లో నీటి పసుపు రంగును చూసినప్పుడు, వారు మొదట దీనిని ఒక అద్భుతంగా భావించారు. కానీ వాస్తవానికి ఇది మానవ కార్యకలాపాల ఫలితం. నది ఒడ్డున నిర్మించిన ఒక కర్మాగారం తాలుకా వేస్ట్ ను నదిలో పోయడం ప్రారంభించారు. ఈ కారణంగా, నది నీరు పసుపు రంగులోకి మారిపోయింది. నది నీటిని నిపుణులు పరిశీలించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని నీరు యాసిడ్ గా మారినట్లు వారు గుర్తించారు. దానిలో ఒక చుక్క కూడా చర్మాన్ని తాకినా కాలిపోతుందని చెబుతున్నారు. ఎవరైనా అనుకోకుండా ఈ నీటిని తాగితే, వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!
.