YouTuber: ప్రముఖ యూట్యూబర్‌ దుర్మరణం.. 300 కి.మీ స్పీడ్‌తో బైక్‌ నడుపుతూ అనంతలోకాలకు

|

May 04, 2023 | 7:11 AM

ప్రముఖ యూట్యూబర్‌, ప్రొఫెషనల్‌ బైకర్‌ అగస్త్య చౌహాన్ బుధవారం (మే 3) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్‌ వృత్తిరిత్యా బైకర్‌. అతని 'PRO RIDER 1000' అనే యూట్యూబ్..

YouTuber: ప్రముఖ యూట్యూబర్‌ దుర్మరణం.. 300 కి.మీ స్పీడ్‌తో బైక్‌ నడుపుతూ అనంతలోకాలకు
Youtuber Agastya Chauhan
Follow us on

ప్రముఖ యూట్యూబర్‌, ప్రొఫెషనల్‌ బైకర్‌ అగస్త్య చౌహాన్ బుధవారం (మే 3) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్‌ వృత్తిరిత్యా బైకర్‌. అతని ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు 1.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. వేగంగా బైక్‌ నడుపుతూ స్టంట్‌లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు. వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్‌ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్‌ఎక్స్‌10ఆర్‌ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేకు చేరుకోగానే.. గంటలకు 300 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న అగస్త్య బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.