చికెన్ రైస్ తెచ్చాడని ఆవురావురుమని తిన్నారు.. కట్ చేస్తే.. ఆఖర్లో ఊహించని ట్విస్ట్.!

తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఎవ్వరూ ఊహించనటువంటి ఘాతుకానికి తలపడ్డాడు ఓ వ్యక్తి. ఎవరికి తనపై అనుమానం రాకుండా ఉండేలా హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్‌ రైస్‌ పార్శిళ్లలో విషం కలిపి కుటుంబసభ్యుల చేత తినిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? వివరాలు ఇవిగో..

చికెన్ రైస్ తెచ్చాడని ఆవురావురుమని తిన్నారు.. కట్ చేస్తే.. ఆఖర్లో ఊహించని ట్విస్ట్.!
Chicken Rice

Updated on: May 03, 2024 | 11:43 AM

తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఎవ్వరూ ఊహించనటువంటి ఘాతుకానికి తలపడ్డాడు ఓ వ్యక్తి. ఎవరికి తనపై అనుమానం రాకుండా ఉండేలా హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్‌ రైస్‌ పార్శిళ్లలో విషం కలిపి కుటుంబసభ్యుల చేత తినిపించాడు. ఈ ఘటనలో నిందితుడి తాత ప్రాణాలు కోల్పోగా.. తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకెళ్తే.. నామక్కల్ బస్టాండ్ సమీపంలో జీవానందం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా హోటల్ నడుపుతూ.. తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఏప్రిల్ 30న ఆ హోటల్‌కి భగవతి అనే ఇంజినీరింగ్ స్టూడెంట్ వచ్చాడు. ఏడు చికెన్ ఫ్రైడ్ రైస్ పార్శిళ్లు ఆర్డర్ ఇచ్చాడు. ఇక వాటిని ఇంటికి తీసుకెళ్లగా.. ఆవురావురుమంటూ లాగించేశారు భగవతి కుటుంబసభ్యులు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబంలోని ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ రైస్ వల్లే ఇదంతా జరిగిందని.. సదరు హోటల్‌పై ఫిర్యాదు చేశారు భగవతి కుటుంబసభ్యులు. ఈ ఘటనకి కారణం నాసిరకమైన చికెన్ అని భావించిన పోలీసులు హోటల్‌ను సీజ్ చేసి.. చికెన్ రైస్ సాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించి పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భగవతిని పిలిపించి.. మళ్లీ తమదైన స్టైల్‌లో విచారణ జరపగా.. సంచలన నిజం బయటపడింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతోనే కుటుంబాన్ని హత్య చేయాలనుకున్నానని.. అందుకే చికెన్ రైస్‌లో విషం కలిపినట్టు ఎంక్వయిరీలో ఒప్పుకున్నాడు భగవతి. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.