Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్లాడు.. అంతలోనే రిటన్.. ఏమైందని ప్రశ్నించగా

నకిలీ ట్రావెల్ టికెట్‌తో ఎయిర్‌పోర్ట్ లోపలికి ప్రవేశించిన జార్ఖండ్‌కు చెందిన ఓ యువకుడిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అసలు... ఆ యువకుడు ఫేక్ టికెట్ ఎందుకు తయారు చేశాడు? ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి....

Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్లాడు.. అంతలోనే రిటన్.. ఏమైందని ప్రశ్నించగా
Accused Prakhar

Updated on: Mar 13, 2024 | 2:13 PM

స్నేహితురాలికి సెండాఫ్ ఇవ్వాలి. అందరిలా ఎయిర్‌పోర్ట్ ఇవతలి నుంచి ఇస్తే ఏం కిక్ ఉంటుంది.. విమానం వరకు వెళ్లి టాటా చెప్తే కదా అసలు కిక్కు అని భావించాడు. దీంతో తన క్రియేటివిటీ ఉపయోగించి నకిలీ టికెట్ తయారు చేశాడు. దాంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించిన యువకుడిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడ్ని జార్ఖండ్‌కు చెందిన ప్రఖర్ శ్రీవాస్తవ (24)గా గుర్తించారు. నిందితుడు ప్రఖర్ శ్రీవాస్తవ తన స్నేహితురాలు సంకృతిని బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో పంపేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రఖర్ నకిలీ ప్రయాణ టిక్కెట్‌ను సిద్ధం చేసుకుని విమానాశ్రయానికి వచ్చాడు.

నకిలీ టికెట్ చూపించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. కానీ స్నేహితురాలిని పంపి విమానంలో ప్రయాణించకుండానే తిరిగొచ్చాడు. దీంతో అనుమానం వచ్చి గేట్ నెం. 9 వద్ద సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా, తనకు అత్యవసర కాల్ వచ్చిందని, అందుకే తిరిగి వెళ్తున్నానని చెప్పాడు. దీంతో భద్రతా సిబ్బంది ప్రఖార్ ప్రయాణ టిక్కెట్‌ను రీ చెక్ చేయగా అది నకిలీదని గుర్తించారు.

వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులు ప్రఖార్‌ను అదుపులోకి తీసుకుని విచారించినగా.. తన స్నేహితురాలికి వీడ్కోలు పలికేందుకు విమాన టిక్కెట్‌ను ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితులపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు లోపల అతిక్రమణ, నకిలీ టికెట్, మోసం కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో ఇటీవల నమోదైన రెండో కేసు ఇది. గతేడాది నవంబర్‌లో జార్ఖండ్‌కు చెందిన హర్‌ప్రీత్ కౌర్ సైనీ అనే 26 ఏళ్ల టెక్కీ టికెట్ లేకుండా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…