Bicycle Journey: కేరళ టూ కాశ్మీర్ ఓ యువతి సైకిల్ పై యాత్ర.. యువతకు స్వేచ్ఛ ఇవ్వాలంటున్న తండ్రి

|

Aug 01, 2021 | 8:44 PM

Bicycle Journey to Kashmir: భారతీయ సంస్కృతిలోని ఉంది ప్రకృతిని ఆస్వాదిస్తూ కొత్త కొత్త ప్రదేశాలను చూడడం. అలా దేశాటన చేస్తూ.. సమాజం గురించి అవగాహన, విజ్ఞానాన్ని..

Bicycle Journey: కేరళ టూ కాశ్మీర్ ఓ యువతి సైకిల్ పై యాత్ర.. యువతకు స్వేచ్ఛ ఇవ్వాలంటున్న తండ్రి
Bicycle Journey
Follow us on

Bicycle Journey to Kashmir: భారతీయ సంస్కృతిలోని ఉంది ప్రకృతిని ఆస్వాదిస్తూ కొత్త కొత్త ప్రదేశాలను చూడడం. అలా దేశాటన చేస్తూ.. సమాజం గురించి అవగాహన, విజ్ఞానాన్ని పెంపొందించుకునేవాడు. అయితే కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. దీంతో దేశ పర్యటనలకు అర్ధం మారిపోయింది. అయితే గత కొంత కాలంగా కొంతమంది ప్రకృతి ప్రేమికులు బృందాలుగా ఏర్పడి.. కొన్ని కొన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని తచ్చన్న గ్రామానికి చెందిన ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సైకిల్ పై కాశ్మీర్ యాత్ర మొదలు పెట్టింది. ఇదే విషయంపై ఆ యువతి తండ్రి స్పందిస్తూ.. తన కూతురు చేస్తున్న ఈ ప్రయాణం మారుతున్న సమాజ ధోరణికి, కాలానికి ప్రతీకగా అభివర్ణించాడు. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా కోరుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, మనం వారిని నిరోధిస్తే వారి విశ్వాసం, ధైర్యం సన్నగిల్లుతుందని సహ్లా తండ్రి చెప్పాడు.

సకీర్ హుస్సేన్, హఫ్సత్ దంపతుల కుమార్తె సహ్లా. జర్నలిజం చదువుకున్న 21 ఏళ్ల సహ్లా చిన్నతనం నుంచి సైకిల్ పై దేశాన్ని చుట్టిరావాలని కలకనేది. ఈ నేపథ్యంలో డబ్బులు దాచుకుని ఓ సైకిల్ కొనుకుంది. సహ్లా కోరికకు తల్లిదండ్రుల ఆమోదం లభించింది. దీంతో సైక్లింగ్‌లో అనుభవమున్న మహమ్మద్ షామిల్, మషూర్ షాన్‌తో కలిసి సాహస యాత్రకు శ్రీకారం చుట్టింది. అయితే సహ్లా గతంలో కూడా సైకిల్ యాత్ర చేసింది. అయితే దగ్గరలోని ఉన్న ప్రాంతాలకు మాత్రమే.. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న కాశ్మీర్ యాత్ర మాత్రం వేరేవేరీ స్పెషల్ అంటుంది. కశ్మీర్ యాత్ర మాత్రం నా కల. ప్రయాణానికి మూడు నెలలు పడుతుందని భావిస్తున్నాం. కలల గమ్యాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఉత్సాహంతో ఉన్నాను’ అని సహ్లా తెలిపింది.

Also Read: Paytm Job Notification: 10వ తరగతి అర్హత, మంచి వేతనంతో పేటీఎంలో ఉద్యోగవకాశాలు