Yoga Day: ఆగకుండా 51 పుష్‌అప్స్‌.. గవర్నర్‌ ఫిట్‌నెస్‌కు అంతా ఫిదా! వీడియో వైరల్‌

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో "యోగాంధ్ర 2025" కార్యక్రమం లక్షల మందితో గిన్నిస్ రికార్డు సాధించింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి 51 పుష్‌అప్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి మోదీ, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో అధికారులు, నేతలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా యోగాంధ్ర 2025 పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా లక్షల మంది పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు కూడా దక్కింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొన్నారు.

మరోవైపు తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన సూపర్‌ ఫిట్‌నెస్‌తో అందరిని ఔరా అనిపించారు. ఆయన ఏడు వయసులో కూడా ఆగకుండా ఏకంగా 51 పుష్‌అప్స్‌ తీశారు. ఆయన ఫిట్‌నెస్‌కు అక్కడున్న వారు ఫిదా అయిపోయారు. యోగా కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్.ఎన్‌.రవి ఆపకుండా 51 పుష్‌ అప్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వయసులో కూడా ఇంత ఫిట్‌గా ఉండటంపై ఆయనను అంతా ప్రశంసిస్తున్నారు. యువతకు ఆయన స్ఫూర్తి అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి