వ్యవసాయ, రైతు బిల్లుకు రాజ్యసభలో విజయసాయి పూర్తి మద్దతు

|

Sep 20, 2020 | 5:58 PM

రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విధానం వలన రైతులు తమ ఉత్పాదనలకు న్యాయమైన ధర కోసం దళారీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందిని అన్నారు. మార్కెట్‌ లో ధరలు ఒడిదుడుకులకు గురైనప్పుడల్లా దళారులు రైతు కష్టార్జితాన్ని దోచుకోవడానికి చూస్తుంటారని ఆయన చెప్పారు. దీనిని నిర్మూలించి రైతు తమ ఉత్పాదనలకు ధరను […]

వ్యవసాయ, రైతు బిల్లుకు రాజ్యసభలో విజయసాయి పూర్తి మద్దతు
Follow us on

రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విధానం వలన రైతులు తమ ఉత్పాదనలకు న్యాయమైన ధర కోసం దళారీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందిని అన్నారు. మార్కెట్‌ లో ధరలు ఒడిదుడుకులకు గురైనప్పుడల్లా దళారులు రైతు కష్టార్జితాన్ని దోచుకోవడానికి చూస్తుంటారని ఆయన చెప్పారు. దీనిని నిర్మూలించి రైతు తమ ఉత్పాదనలకు ధరను తానే నిర్ణయించుకుని ఆ మేరకు వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఈ బిల్లు వలన కలుగుతుందని విజయసాయి అన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయ విధానాన్ని అనుమతించడం ద్వారా మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ముందుగా నిర్ణయించిన ధరకే రైతు తన ఉత్పాదనలు అమ్ముకోగల సౌలభ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని చెప్పారు. రైతులు ఇప్పటి వరకు మార్కెట్‌లో లైసెన్స్‌ పొందిన ట్రేడర్లకు మాత్రమే తమ ఉత్పాదనలు విక్రయించాలి. ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని ట్రేడర్లు కుమ్మకై రైతుల పంటను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతన్నకు  న్యాయమైన ధర దక్కకుండా చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి ఇకపై కొనసాగదని విజయసాయి వ్యాఖ్యానించారు.