భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైగింక వేధింపులకు పాల్పడ్డారంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆదివారం రోజున దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేష్ టికాయత్ సహా పలువురు రైతులు వచ్చి సంఘీభావం సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైన నిజమని రుజువైతే ఉరేసుకుంటానని బ్రిజ్ భూషన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. అయితే బాధిత మహిళా రెజ్లర్లు మాత్రం తమకు న్యాయం జరిగేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమలో బ్రిజ్ భూషణ్‌ను ఆ నెల 21 లోపు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తమ సమస్యలు పరిష్కరించకుంటే 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని..రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అన్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం