శివసేన నేతకు యూపీ సీఎం యోగీ పంచింగ్‌ ట్వీట్‌‌..

శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగీ పవర్‌ పంచ్ ఇచ్చారు. తొలుత మీ రాష్ట్రాన్ని చూసుకోండి.. మా రాష్ట్రం గురించి టెన్షన్‌ పడకంటంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు ట్విట్టర్‌ వేదికగా. వివరాల్లోకి వెళితే.. మంగళవారం యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు పూజారులు హత్యకు గురైన నేపథ్యంలో.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ… పాల్‌ఘర్ మూక దాడుల లాగా.. బులంద్‌షహర్‌ ఘటనను రాజకీయం చేయకూడదంటూ పేర్కొనడంపై.. యూపీ సీఎం ఫైర్‌ అయ్యారు. […]

శివసేన నేతకు యూపీ సీఎం యోగీ పంచింగ్‌ ట్వీట్‌‌..

Edited By:

Updated on: Apr 29, 2020 | 5:24 PM

శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగీ పవర్‌ పంచ్ ఇచ్చారు. తొలుత మీ రాష్ట్రాన్ని చూసుకోండి.. మా రాష్ట్రం గురించి టెన్షన్‌ పడకంటంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు ట్విట్టర్‌ వేదికగా. వివరాల్లోకి వెళితే.. మంగళవారం యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు పూజారులు హత్యకు గురైన నేపథ్యంలో.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ… పాల్‌ఘర్ మూక దాడుల లాగా.. బులంద్‌షహర్‌ ఘటనను రాజకీయం చేయకూడదంటూ పేర్కొనడంపై.. యూపీ సీఎం ఫైర్‌ అయ్యారు.

ట్విట్టర్‌ వేదికగా.. సంజయ్‌ రౌత్‌కు చురకలంటించారు. మీ సిద్ధాంతాల గురించి ఏం చెప్పగలం అంటూ ప్రశ్నిస్తూ.. పాల్‌ఘర్‌లో జరిగిన సాధువుల హత్యలను రాజకీయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలు చూస్తుంటే.. మీ నీచమైన, దిగజారిన విలువలకు అద్దం పడుతున్నాయంటూ మండిపడ్డారు. మీరు ఎలా రంగులు మారుస్తారో అన్నది మీ వ్యాఖ్యలే చెప్పేస్తున్నాయని.. కేవలం కొన్ని వర్గాల వారి కోసం మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ.. ట్విట్టర్‌లో ఘాటైన రిప్లై చ్చారు. ఇక.. పాల్‌ఘర్‌ సంఘటనలో ఉద్ధవ్‌కు ఫోన్ చేయడంపై కూడా యోగీ స్పందించారు. అక్కడ మరణించిన సాధువులిద్దరు నిర్మోహి అఖాడ వర్గానికి చెందిన వారు కావడం వల్లే తాను ఫోన్‌ చేశానన్నారు. యూపీలో జరిగిన సంఘటనలో నిందితుడిని గంటలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.