బల్లి అనేది ప్రతి ఇంటిలో కనిపించే సాధారణ జీవి. కానీ, ఇళ్లల్లో కనిపించే బల్లులంటే కొందరు భయపడిపోతుంటారు. కానీ, ఇదే బల్లి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజమేనండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు బల్లి ఖరీదుతో.. బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేయవచ్చట. ఎందుకంటే ఇది చాలా అరుదైన బల్లి. అవును, గిక్కో అనే అరుదైన బల్లి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ, భారతదేశంలో ఈ బల్లిని కొనడం, అమ్మడం చట్టవిరుద్ధం.
ఈ బల్లి అధిక ధర వెనుక ఒక కారణం ఉంది. అంటే, మొత్తం ప్రపంచంలో ఈ బల్లి భారతదేశంలోని బీహార్, బీహార్ పక్కనే ఉన్న నేపాల్‌లో మాత్రమే కనిపిస్తుంది. వారి జనాభా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఈ కారణంగా, అవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 3 కింద జాబితా చేయబడ్డాయి. వారి సంఖ్య తక్కువగా ఉన్నందున వాటి వేట, అమ్మకం, కొనుగోలు నిషేధించబడింది. పూర్తిగా చట్టవిరుద్ధం.
వీటి సైజును బట్టి ధర నిర్ణయించింది. నిషేధం విధించడంతో స్మగ్లర్లు ఈ బల్లులను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. దాంతో ఈ అరుదైన బల్లి భారీ ధర పలుకుతున్నాయి.. నివేదికల ప్రకారం, గెక్కో బల్లుల ధర వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఒక సాధారణ బల్లి ధర రూ. 70 నుంచి 80 లక్షల వరకు విక్రయిస్తారు. బల్లి సైజు పెద్దదైతే కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోతుంది.
ఈ బల్లికి ఎందుకు అంత డిమాండ్
గిక్కో బల్లిని అనేక రకాల వ్యాధులకు మందు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నపుంసకత్వం, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులలో ఈ బల్లి మాంసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బల్లిని చైనాలో అనేక సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ బల్లికి విపరీతమైన డిమాండ్ ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..