Educated countries: ప్రపంచంలో అత్యధిక విద్యావంతులున్న దేశాల్లో భారత్ స్థానం ఏంటో తెలుసా.?

|

Oct 02, 2023 | 10:57 AM

ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎంత మంది విద్యావంతులు ఉన్నారనే విషయాలను తెలుసుకునేందుకు గాను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిగ్రీ వరకు చదివిన వారిని విద్యావంతులుగా పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం భారతీయులలో 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న 20 శాతం మంది కాలేజీ, యూనివర్సిటీ చదువులు పూర్తి చేసినట్లు తేలింది...

Educated countries: ప్రపంచంలో అత్యధిక విద్యావంతులున్న దేశాల్లో భారత్ స్థానం ఏంటో తెలుసా.?
Educated Countries
Follow us on

దేశాభివృద్ది ఆ దేశంలో ఉన్న విద్యావంతుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రపంచ దేశాలు సంక్షేమంతో పాటు విద్యకు అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజలను విద్యావంతులు చేసేందుకు గాను ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. మరి ప్రపంచంలో అత్యధిక విద్యావంతులున్న దేశం ఏంటో తెలుసా.? భారత్‌ అత్యధిక విద్యావంతులున్న జాబితాలో ఏ స్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎంత మంది విద్యావంతులు ఉన్నారనే విషయాలను తెలుసుకునేందుకు గాను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిగ్రీ వరకు చదివిన వారిని విద్యావంతులుగా పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం భారతీయులలో 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న 20 శాతం మంది కాలేజీ, యూనివర్సిటీ చదువులు పూర్తి చేసినట్లు తేలింది. కాలేజీ, యూనివర్సిటీ చదువులను పూర్తి చేసిన వారిని విద్యావంతులుగా నిర్వచించిన ఈ అధ్యయనం ప్రకారం.. 69 శాతంతో దక్షిణ కొరియా దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

ఇక దక్షిణ కొరియా తర్వాత కెనడాలో అత్యధిక శాతం విద్యావంతులు ఉన్నారు. అత్యధిక తలసరి GDPతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన లక్సెంబర్గ్, 60 శాతం మంది విద్యావంతులతో ఆరవ స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా.. యునైటెడ్ స్టేట్స్ అనేక యూరోపియన్ దేశాల కంటే వెనుకబడి ఉంది. ఐరోపాలోని ప్రధాన దేశాలలో ఒకటైన జర్మనీ కూడా ఈ జాబితాలో దిగువ స్థానంలో ఉంది. 20 శాతం విద్యావంతులతో భారత్‌ 43వ స్థానంలో నిలిచింది.

పూర్తి జాబితా..

1) దక్షిణ కొరియా: 69%

2) కెనడా: 67%

3) జపాన్: 65%

4) ఐర్లాండ్: 63%

5) రష్యా: 62%

6) లక్సెంబర్గ్: 60%

7) లిథువేనియా: 58%

8) యూకే: 57%

9) నెదర్లాండ్స్: 56%

10) నార్వే: 56%

11) ఆస్ట్రేలియా: 56%

12) స్వీడన్: 52%

13) బెల్జియం: 51%

14) స్విట్జర్లాండ్: 51%

15) యునైటెడ్ స్టేట్స్: 51%

16) స్పెయిన్: 50%

17) ఫ్రాన్స్: 50%

18) డెన్మార్క్: 49%

19) స్లోవేనియా: 47%

20) ఇజ్రాయెల్: 46%

21) లాట్వియా: 45%

22) గ్రీస్: 45%

23) పోర్చుగల్: 44%

24) న్యూజిలాండ్: 44%

25) ఎస్టోనియా: 44%

26) ఆస్ట్రియా: 43%

27) టర్కీ: 41%

28) ఐస్లాండ్: 41%

29) ఫిన్లాండ్: 40%

30) పోలాండ్: 40%

31) చిలీ: 40%

32) స్లోవేకియా: 39%

33) జర్మనీ: 37%

34) చెకియా: 34%

35) కొలంబియా: 34%

36) హంగేరి: 32%

37) కోస్టా రికా: 31%

38) ఇటలీ: 29%

39) మెక్సికో: 27%

40) చైనా: 27%

41) సౌదీ అరేబియా: 26%

42) బ్రెజిల్: 23%

43) భారతదేశం: 20%

44) అర్జెంటీనా: 19%

45) ఇండోనేషియా: 18%

46) దక్షిణాఫ్రికా: 13%

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..